ASBL Koncept Ambience
facebook whatsapp X

నెబ్రాస్కా గవర్నర్‌ హోంలో దీపావళి సంబరాలు

నెబ్రాస్కా గవర్నర్‌ హోంలో దీపావళి సంబరాలు

నెబ్రాస్కా రాష్ట్ర చరిత్రలో గవర్నర్‌ ప్రాంగణంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. చరిత్రలో మొదటిసారిగా దీపావళి వేడుకలు గవర్నర్‌ ప్రాంగణంలో తొలిసారిగా జరిగాయి. ఈ దీపావళి వేడుకకు  నెబ్రాస్కా రాష్ట్ర భారతీయ ప్రముఖులు డాక్టర్‌ ఫణి తేజ్‌ ఆదిదం, సుందర్‌ చొక్కర (నెబ్రాస్కా హిందూ దేవాలయం అధ్యక్షుడు), కొల్లి ప్రసాద్‌, నవీన్‌ కంటెం, మల్లికా మద్దూరి జయంతి, దిలీప్‌ దోనేపూడి, తాతారావు కోసూరి, రాజా కోమటిరెడ్డి, అరుణ్‌ పాండిచ్చేరి, వందనా సింగ్‌, ముకుంద్‌ క్యామ్టీ, సుధా శివమణి, ప్రశాంత్‌ పనిక్కస్సేరిల్‌, కీర్తి రంజిత్‌, తపన్‌ దాస్‌, శైలేష్‌ ఖోస్‌, ఇషాని అడిదమ్‌ మరియు శరత్‌ చంద్ర దొంతరెడ్డి తదితరులు హాజరయ్యారు. 

గవర్నర్‌ రెసిడెన్స్‌ డైరెక్టర్‌ డయాన్‌ రెగ్నెర్‌తో కలిసి మాన్షన్‌ని గైడెడ్‌ టూర్‌ అందించిన ప్రథమ మహిళ సుజానే పిల్లెన్‌ చేతుల మీదుగా ఈ వేడుక ప్రారంభమైంది. బేస్‌మెంట్‌ హాల్‌లో, ప్రథమ మహిళతో కలిసి దీపావళి వేడుకలను గవర్నర్‌ లాంఛనంగా ప్రారంభించారు. వారందరూ కలసి దీపం వెలిగించి ఉత్సవాలకు నాంది పలికారు.  డాక్టర్‌ ఫణి తేజ్‌ ఆదిదమ్‌ హిందూ ప్రార్థనకు నాయకత్వం వహించి, దాని ప్రాముఖ్యతను వివరించారు. 

యూనివర్శిటీ ఆఫ్‌ నెబ్రాస్కా ఒమాహా విద్యార్థి నాయకురాలు ఇషాని అడిడమ్‌, సంఘం తరపున దీపావళి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగించారు. మల్లికా మద్దూరి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించి పండుగను పురస్కరించుకుని గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

గవర్నర్‌ తన వ్యాఖ్యలలో, అమెరికన్‌ మరియు హిందూ సంప్రదాయాలలో కనిపించే విశేషాలను ప్రస్తావించి దీపావళి వంటి హిందూ సంప్రదాయ వేడుకలను ప్రశంసించారు. గవర్నర్‌ మాన్షన్‌లో ప్రతిభావంతులైన చెఫ్‌లు తయారుచేసిన రుచికరమైన దీపావళి విందుతో వేడుక ముగిసింది.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :