సీఎం రేవంత్‌రెడ్డికి అప్పుడే చెప్పా ... కానీ
ఫార్మాసిటీ విషయంలో పంతాలకు పోవద్దని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్లు బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. పట్టా భూముల జోలికి వెళ్లొద్దని హెచ్చరించినట్లు గుర్తు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఫార్మాసిటీ మాకొద్దని గతంలో రైతులు ధర్నా చేశారు. రైతులకు మద్దతుగా నేను ధర్నాకు వెళ్లినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. ప్రాణాలు పోయినా సరే, ఫార్మాసిటీ ఏర్పాటుకు అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల్లో ఏమైనా పరిశ్రమలు పెట్టుకోమని రైతులు చెప్పారు. భూములు పోతే జీవనాధారాన్ని కోల్పోతామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత ప్యాకేజీ ఇచ్చినా భూములు ఇవ్వబోమని ఆనాడే తేల్చి చెప్పారు అని అరుణ తెలిపారు.
Tags :