ASBL Koncept Ambience
facebook whatsapp X

న‌య‌న్‌పై డాక్యుమెంట‌రీ.. ఏమేం చెప్తారో!

న‌య‌న్‌పై డాక్యుమెంట‌రీ.. ఏమేం చెప్తారో!

సినీ సెల‌బ్రిటీల జీవితాల‌ను డాక్యుమెంట‌రీగా తీసి క్యాష్ చేసుకోవ‌డంలో నెట్‌ఫ్లిక్స్(Netflix) ఇప్పుడు బిజీ అయింది. మొన్నీ మ‌ధ్య రాజ‌మౌళి(Rajamouli) డాక్యుమెంట‌రీని తీసి భారీ అంచ‌నాల మ‌ధ్య స్ట్రీమింగ్ చేశారు. మంచి రెస్పాన్సే వ‌చ్చింది కానీ ఆశించిన స్థాయిలో అద్భుతాలైతే చేయ‌లేక‌పోయింది. ఇప్పుడు న‌య‌న‌తార(Nayanthara) జీవితాన్ని బియాండ్ ది ఫెయిరీ టైల్(Beyond the Fairytail)  అనే పేరుతో న‌వంబ‌ర్ 18న ఓ స్పెష‌ల్ ఎపిసోడ్ లా రిలీజ్ చేయ‌నున్నారు.

దీని కోసం లేడీ సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటూ స‌గ‌టు సినీ ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే న‌య‌న్ ఇండస్ట్రీకి వ‌చ్చి 20 ఏళ్లు దాటి పోయింది. 2003లో మ‌ల్లువుడ్ లో ఎంట్రీ ఇచ్చాక చంద్ర‌ముఖి(Chandramukhi)తో మంచి బ్రేక్ అందుకుంది. ఆ త‌ర్వాత తిరిగి వెనక్కి చూసుకునే ప‌ని లేకుండా కెరీర్ ను ప్లాన్ చేసుకుని ముందుకు దూసుకెళ్తుంది న‌య‌న‌తార‌.

ఏ హీరోయిన్ అయినా స‌రే 20 ఏళ్ల త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారుతుంది కానీ న‌య‌న్(Nayan) మాత్రం ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్ గా త‌న హ‌వా కొన‌సాగిస్తుంది. అయితే గ‌తంలో న‌య‌న్ పేరు శింబు(Simbhu), ప్ర‌భుదేవా(Prabhu Deva)తో ప్రేమ వ్య‌వ‌హారాల పేరిట చాలా సార్లు వినిపించింది. మ‌రి వాటి గురించి ఈ డాక్యుdమెంట‌రీలో చెప్తారా లేదా అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాదు సినిమాల‌కు కోట్ల‌లో రెమ్యూన‌రేష‌న్ తీసుకునే న‌య‌న్, సినిమా ప్ర‌మోష‌న్స్ కు మాత్రం రాదు. దానికి స‌రైన రీజ‌న్ ఏంట‌నేది మాత్రం ఇప్ప‌టికీ తెలియదు. విఘ్నేష్ శివ‌న్(Vignesh Shivan) తో ప్రేమ‌, త‌ర్వాత పెళ్లి, స‌రోగ‌సీ ద్వారా పిల్ల‌ల్ని క‌న‌డం ఇలా ఎన్నో అంశాలున్నాయి. మ‌రి ఈ డాక్యుమెంట‌రీలో ఏ మేర‌కు నిజాలు చూపిస్తార‌నేది చూడాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :