ఆ వ్యవస్థపై మాకు విశ్వాసం ఉంది కానీ... గత ప్రభుత్వ చర్యల వల్లే
వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. శాసస మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. గత ప్రభుత్వ చర్యల వల్లే ఆ వ్యవస్థ మనుగడలో లేకుండా పోయింది. వాలంటీర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మేం ప్రయత్నించాం. కానీ లేని ఉద్యోగులకు వేతనాలు ఎలా చెల్లించాలి? వాళ్లు విధుల్లో ఉంటే కొనసాగించే వాళ్లం. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదు. వారికి సంబంధించి గత ప్రభుత్వం జీవోలు ఇవ్వలేదు. ఎన్నికల ముందు వారితో రాజీనామా చేయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వాలంటీర్లు లేరు. 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఉంది. 2023 సెప్టెంబర్‌లో రెన్యెవల్ చేసే జీవలో ఇవ్వలేదు. గత ప్రభుత్వం జీవో ఇచ్చి ఉంటే కొనసాగించి వేతనాలు పెంచేవాళ్లం. మే నెల వరకు మేము వాలంటీర్లకు వేతనాలు చెల్లించాం. ఆ వ్యవస్థపై మాకు విశ్వసం ఉంది అని తెలిపారు.