మరో కీలక పదవి రేసులో భారతీయుడు!
అమెరికాలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్) నూతన డైరెక్టర్‌గా భారతీయ ములాలున్న జై భట్టాచార్యను నియమించాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. రేసులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉండగా, జై వైపే ట్రంప్ ఆసక్తి చూపుతున్నారని తెలిసింది. ఆయన స్టాన్‌ఫోర్డ్ విశ్వ విద్యాలయంలో ఫిజీషియన్, ఆర్థికవేత్తగా శిక్షణ పొందారు. ట్రంప్ కార్యవర్గంలో ఆర్థిక మంత్రిగా ఎంపికైన రాబర్ట్ ఎఫ్ కెన్నడీని జై గత వారం కలిశారు. ఎన్‌ఐహెచ్‌పై తన ఆలోచనలను ఆయనతో పంచుకున్నారు. దీనికి కెన్నడీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో సంస్కరణలు తీసుకురావడంపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో భట్టాచార్య సరికొత్త సృజనాత్మక అంశాలపై ఎన్‌ఐహెచ్ దృష్టి సారించాలని వాదిస్తున్నారు. ఎప్పటి నుంచి ఆ సంస్థలో పాతుకు పోయిన వారి పట్టు తొలగించాలని చెబుతున్నారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకానామిక్ రీసెర్చిలో జై అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక స్టాన్‌ఫోర్డ్‌లో ప్రస్తుతం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.