ASBL Koncept Ambience
facebook whatsapp X

హిందూ ఓటర్లపై ట్రంప్, కమలా కన్ను...

హిందూ ఓటర్లపై ట్రంప్, కమలా కన్ను...

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరింది. ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో... డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ప్రచారపర్వాన్ని పీక్స్ కు చేర్చారు. ఎక్కడ ఏ వర్గాన్ని వదలకుండా.. ఏ ఒక్కఓటు చేజారకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓవైపు పార్టీ అజెండాను వదలకుండానే.. మిగిలిన పక్షాల ఓట్లను తమఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయా వర్గాలపై వరాల జల్లు సైతం కురిపిస్తున్నారు.

హిందువుల హక్కులను పరిరక్షిస్తామన్న ట్రంప్

అమెరికాలో రెండో అతిపెద్ద ఓటర్ల కమ్యూనిటీ అయిన భారతీయులు, మరీ ముఖ్యంగా హిందువుల ఓట్లపై కమలా హారిస్, ట్రంప్ ఫోకస్ పెట్టారు." ఈ క్రమంలో ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. తమ దేశంలో నివసించే హిందువుల హక్కులను పరిరక్షిస్తానని హామీ ఇచ్చారు. రాడికల్ భావజాలం ఉన్న వాళ్లు, హిందూయిజాన్ని వ్యతిరేకించడమే తమ అజెండా పెట్టుకున్న వాళ్ల నుంచి అమెరికన్లలో హిందువులను కాపాడతానని అన్నారు. అంతేకాదు.. తాను హిందువులకు పెద్ద అభిమానిని అని కూడా ట్రంప్ స్పష్టం చేశారు. 2016 నుంచి 2019 వరకు తన పాలనలో భారత్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించానని, ప్రధాని మోడీ తనకు నమ్మకస్తుడైన మితృడని కితాబిచ్చారు. మరోసారి భారత్- అమెరికా పరస్పర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాదు..కమలా హిందువులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు ట్రంప్.

బంగ్లాదేశ్‌లో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలపైనా డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హింసాత్మక పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలపై దాడిని అనాగరిక చర్యగా పేర్కొన్నారు. "మనకు మార్క్సిస్టుల పాలన కావాలా?" ఇలాంటి దాడులు తన హయాంలో ఎప్పుడూ జరగలేదని ట్రంప్ గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ప్రభుత్వం హయాంలో..అటు అమెరికాలో మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా హిందువులు దోపిడీలకు గురి అవుతున్నారని ఆరోపించారు.

ట్రంప్ వరుసగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2016 నాటి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆయన ఆ తరువాతి ఎన్నికల్లో ఓడిపోయారు. మూడోసారి బరిలో నిలిచారు. ఈ నెల 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. దాదాపుగా 35 కోట్ల మంది అమెరికన్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నార్త్ కరోలినా, ఆస్టిన్, టెక్సాస్, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో ట్రంప్, ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఇప్పటికే ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :