ASBL Koncept Ambience
facebook whatsapp X

ట్రంప్ పై మరో ఎటాక్.. రిపబ్లికన్లకు రాజకీయంగా కలిసొస్తుందా..?

ట్రంప్ పై మరో ఎటాక్.. రిపబ్లికన్లకు రాజకీయంగా కలిసొస్తుందా..?

ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్ బీచ్‌లో తనపై జరిగిన హత్యాయత్నంపై ట్రంప్ మరోసారి స్పందించారు. అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పై విరుచుకుపడ్డారు. వారిద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే తనపై ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. డెమొక్రాట్లు తీవ్రమైన పదజాలాన్ని వాడుతున్నారని మండిపడ్డారు. వారి అసత్యాలు నమ్మిన నిందితుడు తనపై కాల్పులు చేయేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. బైడెన్, హ్యారిస్‌ మాటలు ప్రజాస్వామ్యానికే ముప్పు అని అభిప్రాయపడ్డారు. వారు దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదని వ్యక్తం చేశారు. రెచ్చగొట్టేలా తాను కూడా మాట్లాడగలనని.. కానీ అలా చేయనని అన్నారు. అలానే, కొన్ని మీడియాసంస్థలపైనా విమర్శలు గుప్పించారు. కొన్ని సంస్థలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

డెమొక్రాట్ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీవాన్స్ .. ట్రంప్ పై దాడి ఘటనలో అధికార డెమొక్రాట్స్ ను టార్గెట్ చేశారు. సంప్రదాయవాదులెవరు కమలాను చంపాలనుకోలేరని.. లిబరల్స్ మాత్రం రెండుసార్లు ట్రంప్ పై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. జార్జియాలోని ఫెయిత్ అండ్ ఫ్రీడమ్ నిర్వహించిన డిన్నర్ లో ఈ వ్యాఖ్యలు చేశారు వాన్స్. వామపక్ష భావజాలం ఉన్నవారు .. ముందుగా తమ భాషను మార్చుకోవాల్సి ఉందన్నారు. వారు తమ భాషను మార్చుకోకుంటే.. వారి తీరుతో ఎవరైనా గాయపడితే, వారి కారణంగా దేశానికి సమస్యలు ఎదురవుతాయన్నారు వాన్స్. తాము రెచ్చగొట్టే భాష మాట్లాడమని వాగ్దానం చేస్తున్నామన్నారు. 

ట్రంప్ పై రెండోసారి ఎటాక్ ఘటనను.. రాజకీయంగానూ ఉపయోగించుకోవాలని రిపబ్లికన్లు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. దీన్ని ప్రచార అంశంగా చేయడం ద్వారా.. ట్రంప్ కు మరోసారి సానుభూతి కలిసివస్తుందన్నది రిపబ్లికన్ల భావనగా సమాచారం. అయితే... అమెరికా సమాజంలో హింసకు తావులేదని ఇప్పటికీ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్.. స్పష్టం చేశారు. మరి ఈ అంశంపై అమెరికన్ సమాజం, ఓటర్లు ఎలా స్పందిస్తారు.. రిపబ్లికన్లకు ఓట్లు రాలతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్‌ బీచ్‌లోని తన గోల్ఫ్‌ కోర్టులో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా.. నిందితుడు ర్యాన్‌ వెస్లీ రౌత్‌ ఏకే 47 రైఫిల్‌తో సంచరించాడు. ఇది గమనించిన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు నిందితుడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు ఓ ఎస్‌యూవీలో పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. రౌత్ ని అదపులోకి తీసుకున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :