ASBL Koncept Ambience
facebook whatsapp X

చెఫ్‌ అవతారమెత్తిన మాజీ అధ్యక్షుడు

చెఫ్‌ అవతారమెత్తిన మాజీ అధ్యక్షుడు

రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ చెఫ్‌గా అవతారమెత్తారు. పెన్సిల్వేనియా ప్రచారం వేళ మెక్‌డొనాల్డ్స్‌ వద్ద ఆగాడు. పసుపు, నలుపు రంగులో ఆప్రాన్‌ ధరించి వంట గదిలోకి వెళ్లి ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ సిద్ధం చేసేందుకు ట్రంప్‌ ప్రయత్నించాడు. నాకు ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ అంటే చాలా ఇష్టం. ఇక్కడ పని చేయడం కూడా చాలా ఇష్టం అని అన్నారు. తర్వాత రెస్టారెంట్‌ డ్రైవ్‌ `త్రూలో ప్రజలకు ఆహారం కూడా సఫ్లై చేస్తూ కబర్లు చెప్పాడు. తాను అందిస్తున్న ఆహార పదార్థాలకు డబ్బుల చెల్లించాల్సిన అవసరం లేదని వారికి చెప్పారు. ఇక్కడ కమల కంటే 15 నిమిషాలు ఎక్కువ సమయం పనిచేశానని, నేను ఫ్రై కుక్‌గా పని చేయాలనుకుంటున్నానని తెలిపాడు. ట్రంప్‌ పర్యటన ముగిసిన కొద్దిసేపటికే, మెక్‌డొనాల్డ్స్‌ అవుట్‌లెట్‌లో ప్రదర్శించిన నోటీసు ఫొటోలను ప్రజలు షేర్‌ చేసుకోవడంతో వివాదం చెలరేగింది.  ట్రంప్‌ సందర్శన నిమిత్తం అవుట్‌లెట్‌ మూసివేయబడుతుందని రెస్టారెంట్‌ కస్టమర్‌లను ఉద్దేశించి నోటీసు అతికించారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :