ASBL Koncept Ambience
facebook whatsapp X

AP Liquor lottery:అత్యాశకు పోయి ఇరుక్కున్న మద్యం వ్యాపారులు.. లిక్కర్ లాటరీలో పరిస్థితులు తారుమారు..

AP Liquor lottery:అత్యాశకు పోయి ఇరుక్కున్న మద్యం వ్యాపారులు.. లిక్కర్ లాటరీలో పరిస్థితులు తారుమారు..

ఏ వ్యాపారంలో అయినా నష్టం వస్తుంది కానీ లిక్కర్ బిజినెస్ (Liquor Business) లో నష్టమే ఉండదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక్క షాపు తగిలిందంటే చాలు వాళ్ళ దశ తిరిగిపోతుంది అనే ఆశతో ఎంతోమంది ఈ లిక్కర్ వ్యాపారం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే అదృష్టం మనకు ఎంత ఆనందాన్ని తెచ్చి పెడుతుందో అనుకోకుండా ఎదురైన దురదృష్టం అంతకు మించిన బాధను మిగిల్చి వెళ్తుంది. ప్రస్తుతం ఏపీ మద్యం షాపుల కేటాయింపు (Liquor shop allotment) విషయంలో కొందరు దురదృష్టానికే బ్రాండ్ అంబాసిడర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 

సాధారణంగా లిక్కర్ షాపులు కేటాయించడానికి ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది. ఇక ఈ మద్యం షాపుల కేటాయింపు లాటరీ పద్ధతిలో ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కువ అప్లికేషన్లు దాఖలు చేస్తే మద్యం షాపులు ఎక్కువగా తగులుతాయి అని లెక్క తరచూ మనం వింటూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాలలో ఈ లెక్కలు తారుమారయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. తాజాగా జరిగిన లిక్కర్ లాటరీలో (Liquor lottery) అదే జరిగింది.

ఆంధ్రాలో జరిగిన మద్యం షాపుల అలాట్మెంట్ సమయంలో కనిపించిన సీన్ అయితే నిజంగా అదృష్టానికి దురదృష్టానికి మధ్య జరిగిన లాటరీ షోలా కనిపించింది. విజయవాడకు చెందిన ఓ బార్ యజమాని మన స్నేహితులతో కలిసి ఏకంగా 480 లిక్కర్ అప్లికేషన్లు దాఖలు చేశారు. అయితే అతనికి వచ్చిన మద్యం షాపుల లెక్క ఎంతో తెలిస్తే షాక్ అవుతారు…480 కి గాను అతని ఖాతాలో కేవలం 11 అంటే 11 మాత్రమే షాపులు వచ్చాయి. ఇక విజయవాడకు చెందిన మరొక మద్యం వ్యాపారి కూడా ఇదే రకంగా తన స్నేహితులతో కలిసి ఒక బృందంగా ఏర్పడి 380 అప్లికేషన్లు దాఖలు చేయగా కేవలం ఐదు షాపులు వచ్చాయి. అమరావతి కి చెందిన మరో వ్యక్తి కూడా ఇదే రకంగా 172 అప్లికేషన్లు వేయగా కేవలం రెండే షాపులు వచ్చాయి. ఇలా భారీ ఎత్తున అప్లికేషన్లు దాఖలు చేసి ఎక్కువ షాపులు రాబట్టాలి అని ఆశించిన కొందరికి షాక్ ల మీద షాక్కులు తగిలాయి.. దీంతో ఇప్పుడు వీరు బ్యాడ్ లక్ కు బ్రాండ్ అంబాసిడర్స్ గా వైరల్ అవుతున్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :