ASBL Koncept Ambience
facebook whatsapp X

One Nation – One Election : 2027లోనే జమిలి ఎన్నికలు..!? సిద్ధమా...??

One Nation – One Election : 2027లోనే జమిలి ఎన్నికలు..!? సిద్ధమా...??

జమిలి ఎన్నికలపై (Duel Elections) దేశవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Govt) ఎలాగైనా జమిలి ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. అనుకున్నది చేయడంలో ప్రధాని మోదీ (PM Modi) సిద్ధహస్తులు. అందుకే జమిలి ఎన్నికలను కూడా కచ్చితంగా నిర్వహించి తీరుతారని అందరూ అనుకుంటున్నారు. జమిలి ఎన్నికల ద్వారా దుబారా వ్యయానికి చెక్ పెట్టవచ్చని.. అలాగే పాలనపై ఫోకస్ పెట్టేందుకు వీలవుతుందనేది బీజేపీ (BJP) ఆలోచన. అందుకే జమిలి ఎన్నికల నిర్వహణకోసం పకడ్బందీగా స్కెచ్ వేసింది.

జమిలి ఎన్నికల నిర్వహణ సవాళ్లతో కూడుకున్న వ్యవహారం. రాష్ట్రాల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రాంతీయ పార్టీల (Regional Parties) హవా నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి జమిలి ఎన్నికలు నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకే జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Former President Ramnath Kovind) నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. ఇటీవలే ఈ కమిటీ నివేదిక సమర్పించింది. దీనికి కేంద్ర కేబినెట్ (Central Cabinet) ఆమోదముద్ర కూడా వేసేసింది.

కోవింద్ కమిటీ (Kovind Committee) ఇచ్చిన సిఫారసుల ప్రకారం రాష్ట్రాల అనుమతితో సంబంధం లేకుండా జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమేనని సమాచారం. అయితే రాజ్యాంగంలోని (constitution) కొన్ని నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది. అయితే వీటిలో కొన్నింటికి రాష్ట్రాల (States) ఆమోదం అవసరం కానుంది. కోవింద్ కమిటీ నివేదికను వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో (Parliament winter sessions) పెట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. కమిటీ సిఫారసులకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు కాస్త సమయం పట్టొచ్చు.

ఒకవేళ రాజ్యాంగ సవరణలు పూర్తయితే జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అయినట్లే. అయితే వచ్చే ఏడాది నాటికి జమిలి ఎన్నికలకు సంబంధించి అన్ని వ్యవహారాలను చక్కబెట్టాలనే ఆలోచనలో మోదీ ప్రభుత్వం (Modi govt) ఉన్నట్టు సమాచారం. అలాగే రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలాలను పరిగణనలోకి తీసుకుని 2027 లేదా 2028లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండేళ్లలో దేశంలోని అత్యధిక రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటితో పాటు జమిలి ఎన్నికలు నిర్వహిస్తే సమస్యలు పెద్దగా ఉండకపోవచ్చనే భావన ఉంది.

దేశంలోని వివిధ రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితులను ఒకసారి చూస్తే... వచ్చే ఏడాది ఢిల్లీ, బీహార్ కు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే 2026లో అసోం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళకు..., 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ కు... 2028లో త్రిపుర, తెలంగాణ, రాజస్థాన్, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, మధ్యప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు.. 2029లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జమ్ము కాశ్మీర్, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రాల కాలపరిమితులతో సంబంధం లేకుండా ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా జమిలి ఎన్నికలకు వెళ్లాలనేది ఆలోచనగా ఉంది. ఇందుకు 2027 లేదా 2028 ముహూర్తంగా నిర్ణయించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :