ASBL NSL Infratech

మ‌రో తెలుగు మూవీకి దుల్క‌ర్ గ్రీన్ సిగ్న‌ల్?

మ‌రో తెలుగు మూవీకి దుల్క‌ర్ గ్రీన్ సిగ్న‌ల్?

ఓ వైపు మ‌ల‌యాళంలో సినిమాలు చేస్తూనే దుల్క‌ర్ స‌ల్మాన్ టాలీవుడ్ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు. అందుకే త‌న ఏజ్, ఇమేజ్ కు స‌రిపోని క్యారెక్ట‌ర్ అయినా మ‌హాన‌టి సినిమా చేసి ఆడియ‌న్స్ తో వావ్ అనిపించుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన డ‌బ్బింగ్ సినిమా క‌నులు క‌నులు దోచాయంటే తెలుగు లో రిలీజై మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ అయింది.

అందుకే ఎంత క‌ష్ట‌మైనా స‌రే త‌ను చేసిన సినిమాల‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంటూ ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్నాడు. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్, వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో ల‌క్కీ భాస్క‌ర్ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే దుల్క‌ర్ మ‌రో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

వైజ‌యంతి బ్యాన‌ర్ లో ప‌వ‌న్ సాధినేని డైరెక్ట‌ర్ గా దుల్క‌ర్ ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇంకా అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రాలేదు కానీ డిస్క‌ష‌న్స్ ఫైన‌ల్ స్టేజ్ లో ఉన్నాయ‌ని తెలుస్తోంది. వైజ‌యంతి బ్యాన‌ర్ తో దుల్క‌ర్ కు ఎంతో స్పెష‌ల్ బాండింగ్ ఉంది. మ‌హానటి, సీతారామ‌మ్ సినిమాలు ఆ బ్యాన‌ర్ నిర్మించినవే. ప‌వ‌న్ చెప్పిన క‌థ‌లో ఎంతో స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే త‌ప్ప దుల్క‌ర్, వైజ‌యంతి నిర్మాత‌లు ఈ సినిమాను ఓకే చేయ‌రు. ఏదైనా అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే కానీ ఈ సినిమా గురించి మిగిలిన వివ‌రాలు తెలిసే అవకాశం లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :