Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు
రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బుధవారం ఉదయం భూప్రకంపనలు (earthquake) నమోదు అయ్యాయి తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారం అడవుల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఏటూరు నాగారం మండలం శంకరాజుపల్లెలో ఓ ఇంటి గోడ కూలింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. 5.3గా నమోదైనట్లు సమాచారం. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది.