టీహబ్‌లో ఈబీ-5 వీసా పెట్టుబడుల సెమినార్
హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీహబ్‌లో ఎంప్లాయిమెంట్ బేస్డ్-5 సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక సెమినార్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంప్లాయిమెంట్ బేస్డ్-5 సీఈఈఓ అబ్దుల్ ఆరీఫ్ మాట్లాడుతూ వీఎస్‌పీ క్యాపిటల్‌తో పాటు 20 మిలియన్ల రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఫోకస్‌లో అగ్రగామిగా ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఈబీ-5వీసాను ఆయన ప్రకటించారు. పెట్టుబడిదారులు, వారి కుటుంబాలు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యేందుకే ఈ వీసా అని ఆయన గుర్తు చేశారు. అమెరికాలో ఉన్న ఈబీ-5 మార్కెట్ ప్రాంతంలో డౌన్‌టౌన్, సబర్బన్ ప్రాంతాలు మొదలైన ప్రధాన అభివృద్ధిని సూచిస్తుందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిని సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
Tags :