ASBL Koncept Ambience
facebook whatsapp X

Chandrababu proved innocent: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు నుంచి బయటపడిన చంద్రబాబు..

Chandrababu proved innocent: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు నుంచి బయటపడిన చంద్రబాబు..

2024 సార్వత్రిక ఎన్నికలకు (2014 elections) ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన కేసు స్కిల్ డెవలప్మెంట్ స్కాం (skill development scam) . ఈ కేసు ఆంధ్ర రాజకీయాలలో ఒక కీలక అధ్యాయంగా ఎప్పటికీ మిగిలిపోతుంది అనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చలాయించిన చంద్రబాబు (Chandra Babu) తొలిసారి ఈ కేసు విషయంలో జైలు పాలయ్యారు. 

అప్పటివరకు స్తబ్దతగా ఉన్న రాష్ట్రం ఒక్కసారి ఉలిక్కిపడడమే కాకుండా చంద్రబాబుకి చేదోడుగా ముందడుగు వేసింది. ఎన్నికల్లో జగన్ (Jagan) ఓటమికి ఒకరకంగా ఈ కేసు కీలక మలుపు అనడంలో డౌట్ లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాడు ఈ కేస్ విషయంలో అరెస్టై (Chandrababu arrest) సుమారు 52 రోజులపాటు రిమాండ్ లో గడిపారు. ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించిన హైడ్రామా ముగింపుకి వచ్చింది. 

తాజాగా ఈ కేసును విచారించిన ఈడి(ED) ఇందులో చంద్రబాబుకు ఎటువంటి ప్రమేయం లేదు అంటూ క్లియర్ చిట్ ఇచ్చింది. ఈటీవీ చారణ ప్రకారం నిధుల డైవర్షన్ విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి…అప్పుడు ఇది జరిగినప్పుడు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబుకు ఎటువంటి ప్రమేయం (Chandrababu skill development case) లేదని నిరూపణ జరిగిందని తెలుస్తోంది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి వినాయ ఖాన్వేల్కర్, సుమన్ బోస్ సహా పలువురు బోగస్ వ్యక్తుల ఇన్వాయిస్ ను సృష్టించినట్లు గుర్తించారట.

కేసు విషయంలో చంద్రబాబుకు సంబంధించి ఒక్క వ్యతిరేక అంశం కూడా లేదు అంటూ తాజాగా ఈడి ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అవుతుంది. చంద్రబాబుకు కాని ఆయనకు సంబంధించిన వ్యక్తులకు కానీ ఎటువంటి డబ్బులు అందినట్లుగా ఎక్కడ ఆధారాలు కనపడలేదట. దీంతో ఈ కేసులో బాబుకి ఎటువంటి సంబంధం లేదు అన్న మాట బలంగా వినిపిస్తోంది.

అయితే 2023 సెప్టెంబర్ 9వ తారీఖున స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులు అప్పటి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబును అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తరలించారు. అక్కడ జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో బాబుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అదే జైల్లో 52 రోజుల పాటు చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్ పై విడుదలయ్యారు. ఇన్ని నెలల తర్వాత ఎప్పుడు ఈ కేసుకి చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదు అని రుజువయింది. ఇక ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :