ASBL Koncept Ambience
facebook whatsapp X

యూఎస్‌ ఓపెన్‌లో సరికొత్త రికార్డు... ఇదే మొదటిసారి

యూఎస్‌ ఓపెన్‌లో సరికొత్త రికార్డు... ఇదే మొదటిసారి

యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్‌ జరిగింది. కరెన్‌ కచనోవ్‌ (రష్యా), డాన్‌ ఎవాన్స్‌ ( బ్రిటన్‌) మధ్య హోరాహోరిగా జరిగిన పోరు ఏకంగా 5 గంటల 35 నిమిషాల పాటు కొనసాగింది. టెన్నిస్‌ ఓపెన్‌ ఎరాలో భాగంగా 1970 నుంచి యూఎస్‌ ఓపెన్‌లో ఇంత సుదీర్ఘమైన మ్యాచ్‌ జరగడం ఇదే మొదటిసారి. గతంలో స్టీఫన్‌ ఎడ్‌బర్గ్‌, మైఖేల్‌ చాంగ్‌ మద్య 1992లో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ 5 గంటల 26 నిమిషాల పాటు సాగగా తాజాగా ఆ రికార్డు బద్దలైంది. కాగా తాజా పోరులో ఎవాన్స్‌ 6-7(6/8), 7-6(7/2), 7-6(7/4), 4-6, 6-4తో కరెన్‌ను ఓడించాడు. మూడు ట్రై బ్రేకర్‌లు జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదు సెట్లలో (68 నిమిషాలు, 67, 72, 67, 61) ఏ ఒక్క సెట్‌ కూడా గంట కంతే తక్కువ జరుగకపోవడం గమనార్హం.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :