ASBL Koncept Ambience
facebook whatsapp X

టీటీడీ చైర్మన్ గా ఆ వ్యక్తి కరెక్ట్ అంటున్న నెటిజెన్లు.. మరి చంద్రబాబు ఏం చేస్తారు?

టీటీడీ చైర్మన్ గా ఆ వ్యక్తి కరెక్ట్ అంటున్న నెటిజెన్లు.. మరి చంద్రబాబు ఏం చేస్తారు?

ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) పాలకమండలిపై, తిరుమల లడ్డుపై (Tirumala Laddu) ఎటువంటి వివాదం కొనసాగుతుందో అందరికీ తెలుసు. అనేక రాజకీయ మలుపులతో.. రోజుకో వివాదంతో ఈ విషయం ఇప్పుడు ఇంటర్నేషనల్ సెన్సేషన్ గా మారింది. ఇదే సమయంలో హిందువులు ఎంతో పవిత్రంగా చూసుకొని ఈ గుడికి చైర్మన్గా (TTD Chairman) ఎవరు ఉంటారు అన్న విషయం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాగైనా సరే టీటీడీని (Hindu )రాజకీయ పెత్తనం నుంచి దూరం చేయాలి అనేది హిందూ ధార్మిక సంస్థల డిమాండ్.

ప్రభుత్వం నామినేటెడ్ పదవులను (Nominated posts) ప్రకటించిన తరువాత నుంచి ఈ విషయం మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 20 దాకా నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఉన్న వివాదాల నేపథ్యంలో టీటీడీ బోర్డు చైర్మన్ (TTD Chairman) పదవిని మాత్రం పెండింగ్లో ఉంచింది. అయితే మొదట్లో ఈ పదవి కోసం కూటమి నుంచి భారీ నాయకుల పేర్లతో పాటు ఓ మీడియా సంస్థ యజమాని పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ఒకానొక సందర్భంలో అయితే డిప్యూటీ సీఎం (Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అన్న మెగా బ్రదర్ (Mega Brother) నాగబాబుకి (Nagababu) ఈ పదవి కట్టబెట్టబోతున్నట్టు ప్రచారం జరిగింది. 

అయితే నాగబాబు ఇవన్నీ కేవలం పుకార్లని వీటిని నమ్మద్దని క్లారిటీ ఇచ్చారు. మరోపక్క వైసీపీ హయాంలో పాలకమండలిగా ఓ పెద్ద జెంబోజెట్ ప్యాకేజీ ఉండేది. అయితే ఇప్పుడు పాలకవర్గం సైజు తగ్గించడమే కాకుండా అభిప్రాయాలతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు, కేంద్ర పెద్దల నుంచి సూచనలు తీసుకొని పాలకమండలి నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అనేక పేర్లు తెరమీదకు వస్తున్నాయి. అయితే అనూహ్యంగా ఓ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

అయితే ఆ పేరు ఏ రాజకీయ నాయకుడిది కాదు.. ఓ సుప్రీం కోర్ట్ (Supreme court) మాజీ ప్రధాన న్యాయమూర్తి పేరు ఇప్పుడు టీటీడి కొత్త చైర్మన్ గా సోషల్ మీడియాలో నెటిజెన్లు సిఫార్సు చేస్తున్నారు. ఆయన మరెవరో కాదు జస్టిస్ ఎన్ వి రమణ (Justice N.V.Ramana) . స్వతహాగా స్వామివారికి పరమ భక్తుడైన రమణ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నో విశిష్టమైన సేవలను అందించారు. కాబట్టి ఇటువంటి బాధ్యతాయుతమైన వ్యక్తులకు పరమ పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవి అప్పగిస్తే బాగుంటుందని నెటిజెన్లు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి..

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :