Fahad FaZil: యానిమల్ బ్యూటీతో షికావత్ సర్ సినిమా
పుష్ప(Pushpa) సినిమాతో నేషనల్ లెవెల్ లో గుర్తింపు దక్కించుకున్న ఫహద్ ఫాజిల్(Fahad Fazil) బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఫహద్ ఇప్పుడు హిందీ మార్కెట్ లో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇంతియాజ్ అలీ(Imthiyaz Ali) దర్శకత్వంలో రూపొందనున్న లవ్ స్టోరీకి ఫహద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ముంబై మీడియా వర్గాలంటున్నాయి.
ఆ సినిమాలో ఫహద్ కు జోడీగా యానిమల్(Animal) ఫేమ్ త్రిప్తి డిమ్రి(Tripthi Dimri)ని ఫైనల్ చేసినట్లు సమాచారం. విండో సీట్ ఫిల్మ్స్ బ్యానర్(Window seat films) పై ఇంతియాజ్ అలీ స్వీయ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఫామ్ లో వెనుకబడిన ఇంతియాజ్ రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్ లో వచ్చిన అమర్ సింగ్ చమ్కీలా(Amar Singh Chamkeela)తో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు.
ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ తో పాటూ అవార్డులు కూడా వచ్చాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్ప తెచ్చిన ఫేమ్ ను ఫహద్ అన్ని విధాలా వాడుకోవాలనే నేపథ్యంలోనే తను బాలీవుడ్ లో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప లానే ఆ సినిమాలో కూడా మంచి సినిమా పడితే అక్కడ కూడా ఫాఫా తన సత్తా చాటొచ్చు.