గోకుల్ రాచిరాజు కు తుది వీడ్కోలు - అశ్రు నివాళులు
కాలిఫోర్నియాలోని బే ఏరియా లో అందరికి మిత్రుడు అయిన శ్రీ గోకుల్ రాచిరాజు క్యాన్సర్ మహమ్మారి బారిన పడి మరణించిన విషయం, బే ఏరియా నే కాకుండా అమెరికా మరియు తెలుగు రాష్ట్రాల లో వున్న గోకుల్ బంధు మిత్రులను కలచివేసిన సంగతి చాల మందికి తెలిసిన విషయమే!
స్వర్గస్తులైన శ్రీ గోకుల్ రాచిరాజు కు ఫ్రీమాంట్ లో చాపెల్ అఫ్ ఏంజెల్స్ క్రిమిటోరియం లో బుధవారం, 10 జులై 2024 న జరిగిన అంతిమయాత్ర కు అనేక మంది మిత్రులు, కుటుంబ సభ్యులు అశ్రు నివాళులతో తుది వీడ్కోలు చెప్పారు.
మొదటగా కుటుంబ సభ్యులు, దగ్గర మిత్రులు ఆ తరువాత స్నేహితులు, ఇతరులు వచ్చి శ్రీ గోకుల్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. శ్రీ గోకుల్ అనేక సందర్భాలలో స్నేహితులతో, కుటుంబ సభ్యులతో తీసిన ఫోటోలతో కూడిన AV ( ఆడియో విజువల్) ప్రదర్శించారు. అక్కడ ఏర్పరిచిన పుస్తకం లో అనేక మంది శ్రీ గోకుల్ తో తమకు ఉన్న అనుబంధం గురించి వివరించి తమ నివాళులు అర్పించారు. దాదాపు 300 పైగా వచ్చిన స్నేహితులందరి నోటా ఒకటే మాట.. అందరి మనసులో ఒకటే భావం - అందరి మనసులు గెలిచిన శ్రీ గోకుల్ రాచిరాజు ధన్య జీవి - చిరకాలం గుర్తుండే ఒక మంచి స్నేహితుడు.
శ్రీ గోకుల్ రాచిరాజు మరణ వార్త వినగానే చలించి పోయిన మిత్ర బృందం ఏర్పాటు చేసిన "Remembering Gokul Rachiraju" అనే వాట్సాప్ గ్రూప్ లో 300 మంది కి పైగా మెంబర్లు ఉన్నారు. దాదాపుగా అందరూ శ్రీ గోకుల్ తో తీసుకున్న ఫోటోలు పెట్టారు.
శ్రీ గోకుల్ తో తమకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. తమ తమ అనుభవాలను పంచుకున్నారు. అందులో కొన్ని ...
"భాషాభిమాని - స్నేహశీలి - బహుముఖ ప్రజ్ఞాశాలి - ప్రియ మిత్రుడు"
"ఎంతో మందిని నవ్వించావు. ఎంతో మందికి ప్రేరణ నిచ్చావు. ఎంతోమందికి సంతోషాన్ని ఇచ్చావు"
"సాహిత్యం నుంచి సైన్స్ దాకా, పురాణాల నుంచి ఫిలాసఫీ దాకా, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ నుంచి ఇంస్టాగ్రామ్ రీల్స్ దాకా ఈ విషయం అయినా అనర్గళంగా మాట్లాడేవాడు. ఆ బుర్రలో అన్ని విషయాలు ఎలా పడతాయి అని ఆశ్చర్య పోయేవాళ్ళం"
"గోకుల్ ఉంటే టైం తెలిసేది కాదు. ఏది అడిగినా సమాధానం ఉండేది"
"My heart aches with sadness when I think of your LEAVING. Who will show me the best vegetarian cookery amongst the world who will guide on Wine pairings? Your passing leaves a gaping hole in my life"
"కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తు వొచ్చేది స్నేహితుడు....వాడు Go cool
సంతోషానికి మారు పేరు స్నేహితుడు....వాడు Go cool
కష్టాన్ని, సంతోషాన్ని నాకు దూరం చేసినవాడు....Go kill
ఏది ఏమైనా నేను మాత్రం వాదించేది, బాధ పడనిది వాడితోనే. వాడే నాకు Go cool or Go kill
నేను ఎవరో నాకు తెలియదు వాడు పరిచయం చేసేదాకా."
" Whenever you were with us for vacation or for a business trip, it was a celebration for my family and friends in my city.. We trained over 900 PMP Students in a 6 years journey. Your ability to teach anything effortlessly, your versatility, your personality made you VERY SPECIAL. We always cherish your smile, your jokes, and your advices "
" చెలిమికి మారు పేరు ఓ నేస్తమా...అందరి హృదయాలు లోను నీ ప్రేమ అనే జ్యోతిని వెలిగించి, ఆ వెలుగునే తీపిగుర్తుగా మాకు మిగిలిచి అందుకోలేని సుదూర తీరాలకు వెళ్ళిపోయావు...బౌతికంగా నీవు మాకు దూరం ఐనా..నీ ప్రేమ..నీ చిరునవ్వు .. నీ నిబద్ధత..నీ స్నేహం అన్నిటినీ మించి నీ దానగుణం మాతోనే ఉంటాయి"
" Dear Mavayya, ........... 2024 is a really really bad year for us.No combination of the alphabet can tell you the grief I'm having for you leaving us. You always treated us like your own children. Friends used to flex about different material things, but I used to flex about the coolest mavayya who has utmost knowledge, humor, and a good heart. "
" నాకు AltaVista ని పరిచయం చేసింది గోకుల్. నాకు తెలిసి ఈ గ్రూప్ లో చాలామందికి AltaVista గురించి తెలిసి ఉండదు. Google లేని రోజుల్లో Google నీ పరిచయం చేసిన వ్యక్తి గోకుల్. నేను Hyderabad లో కంప్యూటర్ courses చేయడానికి వెళితే గోకుల్ నాకు ఉండడానికి free ga అపార్ట్ మెంట్ ఇచ్చి సహాయం చేశాడు. నేను ఈ రోజు ఈ పొజిషన్ లో వుండడానికి అతని సహాయం ఎంతో వుంది."