ASBL NSL Infratech
facebook whatsapp X

యూఎన్‌ ఇంపాక్ట్‌ సమ్మిట్‌కు... తెలంగాణ నుంచి ఐదుగురు

యూఎన్‌ ఇంపాక్ట్‌ సమ్మిట్‌కు... తెలంగాణ నుంచి ఐదుగురు

యువతకు అవసరమైన హరిత నైపుణ్యాలను సమకూర్చే ప్రయాణంలో 1 మిలియన్‌ ఫర్‌ 1 బిలియన్‌ గ్రీన్‌ స్కిల్స్‌ అకాడమీ ఒక మైల్‌స్టోన్‌గా నిలుస్తుదని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని యూయన్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన యాక్టివేట్‌ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ  వినూత్న కార్యక్రమాలతో సుస్థిరమైన అభివృద్ధిని పెంపొందించడానికి 1 మిలియన్‌ ఫర్‌ 1 బిలియన్‌ చేస్తున్న కృషిని కొనియాడారు.

హైదరాబాద్‌లో జరిగిన గ్రీన్‌ స్కిల్స్‌ అకాడమీ లెవరేజింగ్‌ ఏఐ గ్రాండ్‌ ఫినాలేలో ఐదుగురు యువ ఆవిష్కర్తల విజేతలను ప్రకటించారు. వీరు డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి (యూఎన్‌) ప్రధాన కార్యాలయంలో జరగబోయే 1మిఫర్‌ 1బి 8వ వార్షికోత్సవ యాక్టివేట్‌ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో పాల్గొననున్నారు. అందులో మీత్‌ కుమార్‌ షా ( విజ్ఞాన భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌), నారాయణం భవ్య ( మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ ఉమెన్స్‌ హైదరాబాద్‌), నిర్మల్‌కు చెందిన దీక్షా డిగ్రీ కళాశాల విద్యార్థి మనల్‌ మునీర్‌, హైదరాబాద్‌ మల్లారెడ్డి మహిళా ఇంజనీరిగ్‌ కళాశాల నుంచి పెమ్మసాని లిఖిత చౌదరి, సత్యవతి కోలవల్లి ఉన్నారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :