ASBL Koncept Ambience
facebook whatsapp X

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత  జైపాల్‌ యాదవ్‌ జూబ్లీహిల్స్‌ ఏసీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. రెండు గంటలపాటు విచారించిన అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు.  విచారణ అనంతరం జైపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ  ఓ వివాదం పరిష్కారం  కోసం తిరుపతన్నను కలిశాను. ఆయన మా సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కలిశా. రెండు కుటుంబాల మధ్య విభేదాల కేసులో 2 ఫోన్‌ నంబర్లు ఇచ్చా. తిరుపతన్న ద్వారా ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించాననే ఆరోపణలతో నాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ రెండు ఫోన్‌ నంబర్లను ట్యాపింగ్‌ చేసిన సంగతి నాకు తెలియదు.  పోలీసులు నా ముందు కొన్ని ఆధారాలు పెట్టి వివరణ అడిగారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తా అని తెలిపారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :