యాపిల్ కీలక నిర్ణయం... చైనాకు భారీ షాక్
ప్రపంచ వ్యాప్తంగా 85 శాతం ఐఫోన్‌ల తయారీతో గుత్తాదిపత్యం వహిస్తున్న డ్రాగన్ కంట్రీకి భారీ షాక్ తగలనుందా? తాజాగా, యాపిల్ తీసుకున్న నిర్ణయం చైనా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఐఫోన్‌ల తయారీలో ప్రధాన దేశమైన చైనాకు, యాపిల్ ప్రొడక్ట్‌ల తయారీ, సరఫరా, అమ్మకాలు, సర్వీసింగ్ వంటి విభాగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న భారత్‌కు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాను కాదనుకొని భారత్‌లో ఐఫోన్ 15ను భారీ ఎత్తున తయారు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో తమిళనాడు పెరంబదూర్ కేంద్రంగా ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్‌కు ప్లాంట్‌లో గతంలో క ంటే ఎక్కువగానే ఈ లేటెస్ట్ ఐఫోన్‌లను తయారు చేయనుంది. చైనాలో తయారైన యాపిల్ ప్రొడక్ట్‌లు ఇతర దేశాలకు దిగుమతి చేసిన వారం రోజుల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.