ASBL Koncept Ambience
facebook whatsapp X

పుష్ప‌2 ముప్పును మ‌ర్చిపోతున్న గేమ్ ఛేంజ‌ర్

పుష్ప‌2 ముప్పును మ‌ర్చిపోతున్న గేమ్ ఛేంజ‌ర్

సిట్యుయేష‌న్ వ‌చ్చిన ప్ర‌తీసారీ గేమ్ ఛేంజ‌ర్(Game changer) నిర్మాత దిల్ రాజు(dil raju) సినిమాను క్రిస్మ‌స్ కు రిలీజ్ అని చెప్తున్నాడు త‌ప్పించి రిలీజ్ డేట్ ను మాత్రం అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసింది లేదు. ఇప్ప‌టివ‌ర‌కు సినిమా నుంచి రెండు లిరికల్ సాంగ్స్ మాత్ర‌మే వ‌చ్చాయి. ద‌స‌రాకు టీజ‌ర్ వ‌స్తుందనుకుంటే అది మిస్ అయింది.

దీపావ‌ళికి మూడో పాట రిలీజ్ కానుంద‌ని త‌మ‌న్(thaman) ఇప్ప‌టికే తెలిపాడు. అయితే దిల్ రాజు ప్లాన్ ప్ర‌కారం గేమ్ ఛేంజ‌ర్ డిసెంబ‌ర్ 20 లేదా 25న రిలీజ్ అయ్యే ఛాన్సుంది. రిలీజ్ కు టైముంది అనుకుంటున్న గేమ్ ఛేంజ‌ర్ టీమ్ పుష్ప2(Pushpa2) ముప్పును మ‌ర్చిపోతున్నారు. గేమ్ ఛేంజ‌ర్ కంటే స‌రిగా రెండు వారాల ముందు పుష్ప‌2 రిలీజ్ కానుంది.

పుష్ప‌2 సినిమా ప్ర‌స్తుతం మూడు యూనిట్ల షూటింగ్, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఇంకా ప్ర‌మోష‌న్స్ ను మొద‌లుపెట్ట‌లేదు. పుష్ప‌2 ప్ర‌మోష‌న్స్ ఒక‌సారి మొద‌ల‌య్యాయంటే పాన్ ఇండియా లెవెల్ లో ఆ సినిమాపైనే అటెన్ష‌న్ ఉంటుంది. కాబ‌ట్టి ఈలోపు గేమ్ ఛేంజ‌ర్ ఆడియ‌న్స్ అటెన్ష‌న్స్ ను కొట్టేయాలంటే టీజ‌ర్ లేదా మంచి సాంగ్ ఒక‌టి రిలీజ‌వాలి. లేక‌పోతే గేమ్ ఛేంజ‌ర్ టీమ్ పుష్ప‌2 ప్ర‌మోష‌న్స్ లో కొట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌నే మాట సోష‌ల్ మీడియాలో గ‌ట్టిగా వినిపిస్తోంది. మ‌రి ఇప్పుడైనా గేమ్ ఛేంజ‌ర్ టీమ్ ప్ర‌మోష‌న్స్ ను వేగ‌వంతం చేస్తుందేమో చూడాలి.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :