ASBL Koncept Ambience
facebook whatsapp X

గేమ్ ఛేంజ‌ర్ నెక్ట్స్ సాంగ్ ఎప్పుడంటే

గేమ్ ఛేంజ‌ర్ నెక్ట్స్ సాంగ్ ఎప్పుడంటే

రామ్ చ‌ర‌ణ్(ram Charan) న‌టించిన గేమ్ ఛేంజ‌ర్(game Changer) కోసం మెగా అభిమానులు ఎంత‌గా వెయిట్ చేస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మూడేళ్ల కింద‌ట మొద‌లైన ఈ సినిమా కొన్ని కార‌ణాల వ‌ల్ల షూటింగ్ లేట‌వ‌డంతో రిలీజ్ ఆల‌స్య‌మైంది. ఫైన‌ల్ గా ఈ ఇయ‌ర్ క్రిస్మ‌స్‌కు గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

రిలీజ్ డేట్ దగ్గ‌ర ప‌డుతున్న‌ప్ప‌టికీ గేమ్ ఛేంజ‌ర్ నుంచి ఇంకా టీజ‌ర్ రాలేదు. ఇప్ప‌టివ‌ర‌కు సినిమా నుంచి రెండు సాంగ్స్ మాత్ర‌మే రిలీజ‌య్యాయి. ద‌స‌రాకు టీజ‌ర్ రిలీజవుతుంద‌ని కొన్నాళ్ల కింద‌ట ప్ర‌చార‌మైంది కానీ ఇప్పుడు టీజర్ రావ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని గేమ్ ఛేంజ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్(Thaman) తెలిపాడు.

దీంతో చ‌ర‌ణ్ ఫ్యాన్స్ ఇప్పుడు తీవ్రంగా నిరాశ ప‌డ్డారు. టీజ‌ర్ లేద‌ని చెప్పి ఫ్యాన్స్ ను నిరాశ ప‌రిచిన త‌మ‌న్ మ‌రో గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. సినిమా కోసం టీమ్ నిరంత‌రం వ‌ర్క్ చేస్తూనే ఉంద‌ని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ చాలా వేగంగా జ‌రుగుతున్నాయ‌ని, ప్ర‌తీ నెలా ఒక లిరిక‌ల్ సాంగ్ రిలీజ్ చేయ‌డం కోసం అన్ని సాంగ్స్ కు సంబంధించిన వ‌ర్క్స్ ను పూర్తి చేసిన‌ట్లు చెప్పిన త‌మ‌న్, నెక్ట్స్ సాంగ్ ను ఈ నెల 30న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చెప్పి ఫ్యాన్స్ కు సంతోషాన్నిచ్చాడు.  
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :