ASBL NSL Infratech

రివ్యూ : ఆకట్టుకోలేని "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"

రివ్యూ : ఆకట్టుకోలేని "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి"

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు : శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌,
నటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా, సినిమాటోగ్రఫీ: అనిత్ మధడి
ఎడిటింగ్: నవీన్ నూలి, సహ నిర్మాతలు : వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి
నిర్మాతలు : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
దర్శకుడు: కృష్ణ చైతన్య
విడుదల తేదీ: 31.05.2024
నిడివి: 2 ఘంటల 26 నిముషాలు 

మాస్ కా దాస్  విశ్వక్ సేన్ తొలి చిత్రం నుండి విభిన్నంగా ఉండేలా అన్ని రకాల జానర్లను ప్రయత్నిస్తూనే ఉన్నాడు. లవ్ స్టోరీ అయినా, మాస్ కారెక్టర్ అయినా, ప్రయోగాత్మక పాత్రలైనా కూడా విశ్వక్ సేన్ ముందుంటాడు. ఇక ఇప్పుడు మాస్‌లో కొత్త లుక్‌తో విశ్వక్ సేన్ ఆకట్టుకునేందుకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఇది వరకు ప్రేమ కథా చిత్రాలను తీసిన కృష్ణ చైతన్య  రూటు మార్చి రంగస్థలం, పుష్ప జానర్లోకి వచ్చాడు. కృష్ణ చైతన్య, విశ్వక్ సేన్ చేసిన ఈ ప్రయత్నం మరి ఏ విధంగా ఉందొ సమీక్ష లో చూద్దాం.

కథ :

కథ  కొవ్వూరు, గోదావరి మధ్యలోని లంకల ప్రాంతం చుట్టూ ఈ కథ జరుగుతుంది. అక్కడ ఓ ఆనవాయితీ ఉంటుంది. గంగమ్మ దగ్గర కత్తి కట్టడం అనే ఓ సంప్రదాయం నడుస్తుంటుంది. ఎవరి పేరు అయినా రాసి కత్తి కడితే.. అతన్ని చంపే వరకు నిద్రపోరు. అలా లంకల రత్నాకర్  అలియాస్ రత్న (విశ్వక్ సేన్) పేరు మీద అతని నలుగురు స్నేహితులు కత్తి కడతారు. ఆ నలుగురు స్నేహితులు రత్నని ఎందుకు చంపాలనుకుంటారు? ఈ లంకల ప్రాంతంలోని రాజకీయాలు ఏంటి? నానాజి (నాజర్), ఎమ్మెల్యే దొరసామి (గోపరాజు రమణ) మధ్య వైరం ఏంటి? ఏమీ లేని రత్న.. ఎమ్మెల్యేగా ఎలా ఎదుగుతాడు? ఆ తరువాత ఏం జరుగుతుంది? రత్న జీవితంలో రత్నమాల (అంజలి) పాత్ర ఏంటి? బుజ్జి (నేహా శెట్టి) వచ్చాక రత్న లైఫ్ ఎలా మారుతుంది? ప్రత్యర్థుల ఎత్తుగడలను రత్నాకర్ ఎలా తిప్పికొట్టాడనే విషయాన్ని వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల హావభావాలు :

లంకల రత్నాకర్‌గా విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అతడు గోదావరి యాసలో చెప్పే డైలాగులు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అధికారం రాకముందు, వచ్చిన తరువాత అతడి పాత్రలోని వైవిధ్యాన్ని విశ్వక్ సేన్ చాలా బాగా చూపెట్టాడు. అంజలి మరోసారి తన నటనతో ఆకట్టుకుంటుంది. ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, యువన్ శంకర్ రాజా అందించిన స్కోర్ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చాయి. గోపరాజు రమణ, నాజర్, హైపర్ ఆదిలు తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు:

కృష్ణ చైతన్య డైరెక్షన్ ఓవరాల్‌గా బాగున్నా, సెకండాఫ్‌పై ఆయన మరింత దృష్టి పెట్టి ఉంటే సినిమా కథ మరింత ఆసక్తికరంగా ఉండేది. యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు బలంగా నిలిచింది. ఆర్ఆర్ సినిమాకు మేజర్ అస్సెట్. కెమెరా వర్క్ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది అనిత్ మధడి సినిమాటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ ఫస్ట్ హాఫ్‌లో అదిరిపోయినా, సెకండాఫ్‌లో బెటర్‌గా ఉండాల్సింది. మరీ లెంగ్తీగా కూడా అనిపించలేదు. సితార బ్యానర్ నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

విశ్లేషణ:

మొదటి పావుగంట ఏదో ఇంట్రెస్టింగ్‌గా కథ సాగుతుందే? అని అనేలా ఉంటుంది. కానీ ఆ తరువాత మళ్లీ ట్రాక్ తప్పినట్టుగా.. రొటీన్ కథను చూసినట్టు అనిపిస్తుంది. ఇక రంగస్థలం, పుష్ప ప్రభావం దర్శకుడి మీద బాగానే పడినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కాస్త హైలో సాగితే.. సెకండాఫ్ నీరసంగా, చప్పగా సాగుతుంది. రత్న ఎమోషన్స్, భార్యబిడ్డల కోసం పడే తాపత్రయం, ఆ సెంటిమెంట్‌ అంత ఎమోషనల్‌గా కనెక్ట్ కాదు. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్‌లో విశ్వక్ మెచ్యూర్డ్ పర్ఫామెన్స్, ఎమోషనల్ టచ్ బాగుంటుంది. మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్‌లో ఉన్నంత ఊపు.. సెకండాఫ్‌లో కనిపించదు. కానీ ఓవరాల్‌గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది విశ్వక్ సేన్‌కి ప్లస్ అవుతుంది. కొత్త యాంగిల్‌ను డైరెక్టర్ చూపించాడు.మొత్తానికి ఓ కే అనిపించే సినిమా.  

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :