హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ కొలువు తీరింది. హిటాచీ గ్రూపునకు చెందిన డిజిటల్ ఇంజినీరింగ్ సంస్థ గ్లోబల్ లాజిక్ హైదరాబాద్‌లో నూతన డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 600 మంది ఇంజినీర్లు కెపాసిటీ సామర్థ్యం కలిగిన ఈ డెలివరీ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐటీ హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్‌లోని మరో గ్లోబల్ సంస్థ డెలివరీ సెంటర్‌ను ప్రారంభించిందని, తెలంగాణకు ఇది మరో మైలురాయి వంటిదని, డిజిటల్ ఇన్నోవేషన్, ట్రాన్స్‌ఫర్మేషన్‌లో గ్లోబల్ లీడర్‌గా రాష్ట్రం ఎదుగుతున్నదన్నారు. ప్రస్తుతం నగరంలో 220 జీసీసీ (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు) ఉన్నాయన్నారు. వచ్చే మూడేండ్లకాలంలో ఈ డెలివరీ సెంటర్ సామర్థ్యం 2 వేలకు పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడిరచాయి.
Tags :