ASBL Koncept Ambience
facebook whatsapp X

హైదరాబాద్‌లో గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ నిర్మాణాలు

హైదరాబాద్‌లో గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ నిర్మాణాలు

గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌ తన వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తోంది. ప్రధాన పట్టణాలే కాక టైర్‌-2 నగరాల్లోకి ప్రవేశించడానికి కూడా  ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. బెంగళూరు కాకుండా మైసూర్‌, మంగళూరు, హోసూరు వంటి దక్షిణ భారతదేశంలోని టైర్‌-2 పట్టణాల్లో కూడా ప్లాట్లను అభివృద్ధి చేయడానికి చూస్తున్నామని గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ సౌత్‌ సీఈఓ ప్రమోద్‌ బిష్త్‌ వెల్లడించారు.  గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ బెంగళూరు, చెన్నైల్లో బలంగా ఉండగా.. 2024లో హైదరాబాద్‌లో ప్రవేశించింది. దాదాపు రూ.3500 కోట్ల ఆదాయ లక్ష్యంతో రాజేంద్ర నగర్‌లో 12.5 ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అనంతరం కోకాపేటలో మూడు ఎకరాలు తీసుకుంది. ‘ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఈ రెండు ప్రాజెక్టుల నుంచి ప్రీమియం, లగ్జరీ లాంచ్‌ లు చేయాలని చేయాలని చూస్తున్నట్టు బిష్త్‌ వెల్లడిరచారు. టైర్‌-2 నగరాల్లో కూడా 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 30వేల కోట్లతో 21.9 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టులు ప్రారంభించి.. 15 మిలియన్‌ చదరపు అడుగుల మేర నిర్మాణాలను పూర్తి చేసి డెలివరీ చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :