ASBL Koncept Ambience
facebook whatsapp X

జీడబ్ల్యూటీసీఎస్‌ కార్యక్రమాలకు మంచి స్పందన

జీడబ్ల్యూటీసీఎస్‌ కార్యక్రమాలకు మంచి స్పందన

వాషింగ్టన్‌ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్‌ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. జీడబ్ల్యూటీసీఎస్‌ అందాల పోటీలకు, ఆట, పాట పోటీల్లో ఎంతోమంది పాల్గొని విజయవంతం చేశారు. కల్చరల్‌ గాలా పేరుతో గోల్డెన్‌ వాయిస్‌ పోటీలను సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల వారీగా పోటీలలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందించారు. డాన్సింగ్‌ సూపర్‌ స్టార్‌ పేరుతో నిర్వహించిన పోటీల్లో కూడా ఎంతోమంది పాల్గొన్నారు. సబ్‌ జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి ఆగస్టు 25వ తేదీన విల్లార్డ్‌ మిడిల్‌ స్కూల్‌ లో ఈ పోటీలు జరిగాయి. వివిధ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ వయస్సులవారీతో వేదిక జరిగి ప్రాంతం సందడిగా కనిపించింది. అలాగే వివిధ పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. 

ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షుడు కృష్ణ లాం మాట్లాడుతూ ఈ పోటీలకు వచ్చిన స్పందన చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. వివిధ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచిన వారందరినీ ఆయన అభినందించారు. సెప్టెంబర్‌ 27,28 తేదీల్లో జరిగే జిడబ్ల్యూటిసిఎస్‌ స్వర్ణోత్సవ వేడుకలకు కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు.  

ఈ పోటీలను ఎంతో చక్కగా నిర్వహించిన కల్చరల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుష్మ అమృతలూరి, సెక్రటరీ (కల్చరల్‌) శ్రీ విద్యా సోమతోపాటు వారి టీం గణేష్‌ ముక్క నంద చెల్లువేది అమర్‌ అతికం, శ్రావణి వింజమూరి, నివేదిత చంద్రుపట్ల, శిరీష, పావని పూదోట తదితరుల సేవలను కృష్ణ లాం కొనియాడారు. ఈ పోటీల్లో గెలిచిన వాళ్ళందరికీ బహుమతులు అందజేశారు.  

ఈ పోటీలకు పలువురు జడ్జీలుగా వ్యవహరించారు. సింగింగ్‌ పోటీలకు తరుణ్‌ దోనిపాటి, భార్గవ్‌ హల్కూర్‌ చంద్రశేఖర్‌, షకీరా బేగం, బ్యూటీ పేజియంట్‌ పోటీలకు సాయి సుధ పాలడుగు, మీనాల్‌ మణికందన్‌, అనుపమ సత్యవోలు, క్లాసికల్‌ డ్యాన్స్‌కు ఇంద్రాణి దావులూరి, కుసుమరావు, సాయికాంత లక్ష్మీరాపర్ల, నాన్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌కు ప్రత్యూష కుర్ర, నవ్య ఆలపాటి, షకీరా బేగం జడ్జీలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. 

సుశాంత్‌ మన్నె, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, శ్రీనివాస్‌ గంగ, పద్మజ బెవరా, చంద్రమాలావతు తదితరుల ఇసి కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని దగ్గర ఉండి పర్యవేక్షించి విజయవంతం చేశారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :