ASBL Koncept Ambience
facebook whatsapp X

వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం : మంత్రి గొట్టిపాటి

వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం  : మంత్రి గొట్టిపాటి

 వైసీపీ అధినేత జగన్‌కి విద్యుత్‌ ఛార్జీల పెంపుపై మాట్లాడే కనీస అర్హత మీకు ఉందా? అని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యత్‌ శాఖ మంత్రి గొట్టిపాట్టి రవికుమార్‌ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా ఏపీని అప్పగిస్తే వ్యకిగత స్వార్థంతో నాశనం చేసింది మీరు కదా అని ధ్వజమెత్తారు. వైసీపీ అమసర్థ పాలన, అస్మదీయులకు దోచిపెట్టిది వాస్తవం కాదా అని నిలదీశారు. పీపీఏలను రద్దు చేయడం, ఉత్పత్తి దారులను భయపెట్టడంతో కేంద్ర ప్రభుత్వం, విదేశీ బ్యాంకుల వద్ద రాష్ట్రం పరువు పోవడానికి మీరు కారణం కాదా జగన్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

2022-23, 2023-24 సంవత్సరాలకు గాను ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రజలపై మోపాలని డిస్కంలకు అనుమతి ఇచ్చిది మీరే కదా? తొమ్మిది సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి ప్రజల రక్తం తాగారు. అలాంటి మీరు చంద్రబాబు పాలనను విమర్శించడమేంటి? మీరు చేసిన తప్పిదాలతోనే కదా అనవసరంగా హిందూజా పవర్‌కు రూ.1200 కోట్లు కట్టాల్సి వచ్చింది. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు  నిర్వీర్యం అయ్యాయి. పోలవరం పూర్తి చేస్తానన్నారు, చేయలేదు. మూడు రాజధానులు నిర్మిస్తానని చెప్పి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించారు. తప్పులన్నీ మీరు చేసి, కూటమి ప్రభుత్వంపై వివర్శలు చేయడమేంటి? అని ప్రశ్నించారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :