ASBL Koncept Ambience
facebook whatsapp X

నారా లోకేశ్‌ అమెరికా పర్యటన విజయవంతం

నారా లోకేశ్‌ అమెరికా పర్యటన విజయవంతం

ఆంధ్రప్రదేశ్‌  ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్‌ అమెరికా పర్యటన వివరంగా పరిశీలిస్తే  ఎంతగా  విజయవంతం అయిందో అర్థం అవుతుంది. వున్నది కేవలం ఆరు  రోజులే అయినా, జరిగిన సమావేశాలు, కలిసిన వ్యక్తులు, విజిట్‌ చేసిన ఆఫీసులు చూస్తే ఆయన (ఆయన ఆఫీస్‌)  చేసిన హోమ్‌ వర్క్‌, ఆయన మాట్లాడిన విషయాలు చూస్తే ఆయన లక్ష్యం అర్థం అవుతాయి  మైక్రోసాఫ్ట్‌, ఆపిల్‌, టెస్లా, పెప్సీ కో.. లాంటి అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులతో భేటీ అయి,  ఆంధ్రప్రదేశ్‌ లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఐటీ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు చంద్రబాబు. 2000 సంవత్సరంలోనే విజన్‌ 2020 పేరుతో యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకున్న మార్గదర్శి ఆయన. ఇప్పుడు ఆయన బాటలోనే పయనిస్తున్నారు కుమారుడు నారా లోకేశ్‌. 2047 నాటికి వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. 

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అమెరికాలో పర్యటించారు. మైక్రోసాఫ్ట్‌, ఆపిల్‌, టెస్లా, పెప్సీ కో.. లాంటి అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఐటీ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు చంద్రబాబు. 2000 సంవత్సరంలోనే విజన్‌ 2020 పేరుతో యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించు కున్న మార్గదర్శి ఆయన. ఇప్పుడు ఆయన బాటలోనే పయనిస్తున్నారు కుమారుడు నారా లోకేశ్‌. 2047 నాటికి వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేశ్‌ తొలిసారి అమెరికాలో పర్యటించారు. అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ 1 వరకూ ఆయన పర్యటన సాగింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆయనకు పలువురు ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో  పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. పరిపాలనలో ఏఐ వినియోగించడం ద్వారా ప్రజలకు వేగంగా, మెరుగ్గా సేవలందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని.. ఇందుకోసం పీ-4 విధానానికి శ్రీకారం చుట్టారని నారా లోకేశ్‌ వివరించారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యతతో కూడిన మ్యాన్‌ పవర్‌ ను అందించేందుకు యూనివర్శిటీల్లో పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఏపీలో మ్యాన్యుఫ్యాక్చరింగ్‌, రెన్యూవబుల్‌ ఎనర్జ, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్‌ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని వివరించారు. పలు అగ్రశ్రేణి కంపెనీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి.

ఫాల్కన్‌ ఎక్స్‌ అనుబంధ సంస్థ బోసన్‌ మోటార్స్‌ రూపొందించిన ఇంటిలిజెంట్‌ ఎలక్ట్రికల్‌ లైట్‌ యుటిలిటీ వెహికల్‌ డ్రైవర్‌ లెస్‌ క్యాబిన్‌ ట్రక్‌ ను మంత్రి నారా లోకేశ్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాన్‌జోస్‌ మేయర్‌ మట్‌ మహన్‌, మిల్పిటాస్‌ మేయర్‌ కార్మెన్‌ మోంటనో పాల్గొన్నారు. ఏపీలో పురుడు పోసుకున్న బోసన్‌ మోటార్స్‌ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందని లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆయా సంస్థల అనుబంధ యూనిట్లను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయాలని మంత్రి నారా లోకేశ్‌ కోరారు. సరైన ప్రతిపాదనలతో వస్తే పరిశ్రమలస్థాపనకు  సింగిల్‌ విండో విధానం ద్వారా వెనువెంటనే అనుమతులతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని తెలిపారు.

శాన్‌ఫ్రాన్సిస్కో లోని ప్రపంచ ప్రఖ్యాత డాటా సేవల సంస్థ ఈక్వెనెక్స్‌ డాటా సెంటర్‌ కేంద్ర కార్యాలయాన్ని మంత్రి నారా లోకేష్‌ సందర్శించారు. ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, సురక్షితమైన డాటా సేవలను అందిస్తున్న సంస్థగా ఈక్వెనెక్స్‌ కు పేరుంది. ఆంధ్రప్రదేశ్‌ లో డాటాసెంటర్‌ ఏర్పాటుకు గల అనుకూలతలను మంత్రి నారా లోకేశ్‌ వారికి వివరించారు. భారత్‌ లో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ లో డాటా సెంటర్‌ ఏర్పాటుచేయాల్సిందిగా మంత్రి లోకేష్‌ ఆహ్వానించారు.

స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దిగా అడుగులు 

శాన్‌ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌ ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి మంత్రి నారా లోకేష్‌ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. ఎపిలో దేశంలోనే 2వ అతిపెద్ద తీరప్రాంతం ఉందని.. త్వరలో 4కొత్త పోర్టులు రాబోతున్నాయని వివరించారు. కర్నూలుజిల్లాను డ్రోన్‌ వ్యాలీగా... ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్‌ హబ్‌ గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. దేశంలో తయారవుతున్న సెల్‌ ఫోన్లలో 25శాతం ఎపిలోనే తయారవుతున్నాయని లోకేశ్‌ వివరించారు. దేశవ్యాప్తంగా 50శాతం ఎసిలు కూడా ఎపిలోనే  తయారవుతున్న విషయాన్ని గుర్తు చేశారు.

కృష్ణా, గుంటూరు క్యాపిటల్‌ రీజయన్‌ లో 5 బిలియన్‌ డాలర్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని మంత్రి నారా లోకేశ్‌ వెల్లడిరచారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్‌ ఫోర్ట్స్‌, పెట్రో కెమికల్స్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్‌, ఫార్మా రంగాలపై దృష్టిసారించామన్నారు. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నంలో సివిల్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ డేటా సెంటర్‌ రాబోతున్నాయన్నారు. త్వరలో టిసిఎస్‌ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతోంద న్నారు. రాష్ట్రాన్ని గ్లోబల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ గా తీర్చిదిద్దేందుకు ఈడిబిని పునరుద్దరించామని లోకేశ్‌ తెలిపారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలో డ్రాప్‌ బాక్స్‌ కో ఫౌండర్‌ సుజయ్‌ జస్వా నివాసంలో పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్‌ సమావేశమయ్యారు. అమరావతి రాజధాని పరిసరాల్లో ప్రభుత్వరంగంలో 3బిలియన్‌ డాలర్లు, ప్రైవేటు రంగంలో 4.5బిలియన్‌ డాలర్లతో వివిధ నిర్మాణాలు, అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. వీటికితోడుగా రాష్ట్రంలోని మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ, మూలపేట ప్రాంతాల్లో కొత్తగా గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్టులు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. ఏడాదిన్నరలో పూర్తికానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా పెద్దఎత్తున ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయని అన్నారు. అమరావతిలో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

టెస్లా సెంట్రల్‌ ఆఫీసులో నారా లోకేశ్‌ 

ఆస్టిన్‌ లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని మంత్రి నారా లోకేష్‌ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ లో పెట్టుబడులు పెట్టేందుకు టెస్లాకు ఉన్న అవకాశాలపై లోకేశ్‌ వివరించారు. 2029 నాటికి ఎపిలో 72 గిగావాట్ల రెన్యువబుల్‌ ఎనర్జీ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మా లక్ష్యసాధనకు టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్‌ కంపెనీల సహాయ,సహకారాలు అవసరమన్నారు. గతంలో చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు ఆటోమొబైల్‌ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషిచేశారని.. కియా, హీరో మోటార్స్‌ వంటి కంపెనీలను రాష్ట్రానికి రప్పించారని గుర్తు చేశారు. టెస్లా %జుప% తయారీ, బ్యాటరీ ఉత్పత్తుల యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశంగా ఉంటుందన్నారు. టెస్లా ఎపికి వస్తే ఈ రంగంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుందన్నారు.

డల్లాస్‌లో నారా లోకేశ్‌ 

పెరోట్‌ గ్రూప్‌ అండ్‌ హిల్‌వుడ్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ రాస్‌ పెరోట్‌ జూనియర్‌ తో మంత్రి నారా లోకేష్‌ డల్లాస్‌లో భేటీ అయ్యారు. ఇన్నోవేటివ్‌ రియల్‌ ఎస్టేట్‌ %డ% పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో పెరోట్‌ గ్రూప్‌ వినూత్న విధానాలు ఏపీ ఆర్థికాభివృద్ధి, స్థిరత్వానికి తోడ్పడతాయని తెలిపారు. అలయన్స్‌ టెక్సాస్‌ తరహాలో పారిశ్రామిక, లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేయడానికి ఎపిలోని తీరప్రాంతం ఎంతో అనువుగా ఉంటుందన్నారు. విశాఖపట్నంలో ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని.. ఇందులో భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. పోర్టులు, హైవేలు, పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పిపిపి ప్రాతిపదికన భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాలని పెరోట్‌ జూనియర్‌ ను కోరారు.

అడోబ్‌ సిఇఓతో నారా లోకేష్‌ భేటీ 

శాన్‌ ఫ్రాన్సిస్కోలో అడోబ్‌ సిఇఓ శంతను నారాయణ్‌ తో నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. ఏపీలో ఇ-గవర్నెన్స్‌ని సమగ్రపర్చడం, గ్లోబల్‌ టెక్‌ హబ్‌గా మార్చడానికి మీవంతు సహకారం అందించాలని లోకేశ్‌ కోరారు. డిజిటల్‌ విద్య ప్లాట్‌ఫారంలలో ఎఐ ఆధారిత పరిష్కారాలను ఏకీకృతం చేయడంలో మీ భాగస్వామ్యాన్ని కోరుతున్నామన్నారు. ఎపిలో అడోబ్‌ ఆర్‌ అండ్‌ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి చేసిన ప్రతిపాదనలపై కంపెనీ సహచరులతో చర్చించి ఎపిలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని శంతను నారాయణ్‌ చెప్పారు.

యాపిల్‌ తయారీ కేంద్రాన్ని ఏపీలో పెట్టండి! 

శాన్‌ఫ్రాన్సిస్కోలోని యాపిల్‌ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని మంత్రి నారా లోకేష్‌ సందర్శించారు. ఆ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఆపరేషన్స్‌) ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో చర్చించారు. భారతదేశంలో యాపిల్‌ కార్యకలాపాల విస్తరణకు ఆంధ్రప్రదేశ్‌ మీకు ఆహ్వానం పలుకుతోందన్నారు. ఏపీలోని 4 ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లలో మీకు అనుకూలమైన ప్రాంతాన్ని ఎంచుకోవాలని కోరారు. మీ తయారీ యూనిట్‌ స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి మేం సిద్ధంగా ఉన్నామన్నారు. టెక్నాలజీ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న మా రాష్ట్రం ఆపిల్‌ ఆర్‌ అండ్‌ డి కేంద్రాన్ని నెలకొల్పేందుకు అనుకూలమైన ప్రాంతమని వివరించారు. ఎపి ప్రభుత్వంతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రియా సుబ్రహ్మణ్యం చెప్పారు.

ఏపీలో సేల్స్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయండి! 

సేల్స్‌ ఫోర్స్‌ ఎఐ సిఈఓ క్లారా షిప్‌ా తో మంత్రి నారా లోకేష్‌ లాస్‌ వెగాస్‌ లోని సినర్జీ సమ్మిట్‌ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఏపీలో ఎఐ స్కిల్లింగ్‌ కార్యక్రమాలను ప్రారంభించేందుకు సహకారం అందించాలని కోరారు.  సేల్స్‌ఫోర్స్‌ AI సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌లు, ప్రయోగాత్మక శిక్షణను అందించడానికి విద్యా సంస్థలతో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సేవల్లో కస్టమర్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌ (CRM)ని మెరుగుపరచడానికి సేల్స్‌ఫోర్స్‌ ఐన్‌స్టీన్‌ ఎఐని ఏపీలో పరిచయం చేయాలని లోకేశ్‌ కోరారు. ఏపీలోని స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల్లో ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌, పబ్లిక్‌ సేఫ్టీ, అర్బన్‌ ప్లానింగ్‌ వంటి రంగాల్లో భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాలని  మంత్రి లోకేష్‌ కోరారు. సేల్స్‌ ఫోర్స్‌ ప్రెసిడెంట్‌ శ్రీని తల్లాప్రగడ, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ రాగినేనితో మంత్రి నారా లోకేష్‌ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో ఆర్‌ అండ్‌ డి సెంటర్‌ ను ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు.

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :