ASBL NSL Infratech
facebook whatsapp X

ఎన్నారైవిఎ గ్లోబల్‌ కన్వెన్షన్‌ జయప్రదం

ఎన్నారైవిఎ గ్లోబల్‌ కన్వెన్షన్‌ జయప్రదం

ఆకట్టుకున్న ఇళయారాజా సంగీత కచేరీ

సెయింట్‌ లూయిస్‌ నగరంలో జూలై 4 నుంచి మూడురోజులపాటు జరిగిన ఎన్నారై వాసవి అసోసియేషన్‌  7వ గ్లోబల్‌ కన్వెన్షన్‌ విజయవంతమైంది. అమెరికాస్‌ సెంటర్‌  కన్వెన్షన్‌ వేదికగా జరిగిన ఈ కన్వెన్షనలో పలు కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాల్లో పలువురు ఎన్నారై వాసవీ నాయకులు, కమిటీ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా నలుమూలల నుండి పలువురు వాసవైట్స్‌ తరలిరావడంతో వేదిక ప్రాంగణం 3 రోజులు సందడిగా కనిపించింది. ఎన్నారై విఎ అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి, కన్వీనర్‌ ఎల్‌ ఎన్‌ రావు చిలకల, కో-కన్వీనర్‌ వంశి గుంటూరు, కన్వెన్షన్‌ సెక్రటరీ ఫణీశ కోడూరి, కన్వెన్షన్‌ ట్రెజరర్‌ శేఖర్‌ పేర్ల, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ రమేష్‌ బాపనపల్లి, జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ తడకమళ్ల, ట్రెజరర్‌ గంగాధర్‌ ఉప్పల ఆధ్వర్యంలో ఇతర బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ మరియు వివిధ కమిటీలవారు ఈ వేడుకకు వచ్చినవారికి చక్కని ఆతిధ్యంతో కూడిన ఏర్పాట్లు చేశారు. వ్యాఖ్యాతలు వర్షిణి మరియు సమీరా బాంక్వెట్‌ డిన్నర్‌ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలికారు. వాసవి మాత జీవిత వృత్తాంతాన్ని ప్రతిబింభిస్తూ ప్రదర్శించిన దృశ్య కావ్యం అందరినీ ఆకట్టుకుంది. వివిధ రంగాలలో సేవలందిస్తున్న పలువురు వాసవైట్స్‌కి ఈ సందర్భంగా అవార్డులు బహుకరించారు.   సినీ నటి లయ, బిగ్‌ బాస్‌ రన్నరప్‌ అమర్‌ చేతుల మీదుగా ఈ అవార్డులను పలువురు అందుకున్నారు. 

కన్వెన్షన్‌ రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఎన్నారై వాసవి అసోసియేషన్‌ విలువలను చాటి చెప్పింది. ఎన్నారైవిఎ అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి, కన్వీనర్‌ ఎల్‌ ఎన్‌ రావు చిలకల, జులై 5వ తేదీన అమెరికా, కెనడా లోని ఎన్నారైవిఎ చాఫ్టర్స్‌ అందరితో పరేడ్‌ నిర్వహించారు. ప్రతి చాప్టర్‌ ఒక థీమ్‌ తో ప్రత్యేకతను చాటుతూ, నృత్యాలు చేస్తూ, వాసవి మాతని కొలుస్తూ, డప్పుల నడుమ  ముందుకు సాగాయి.-కన్వీనర్‌ వంశి గుంటూరు, కన్వెన్షన్‌ సెక్రటరీ ఫణీశ కోడూరి, కన్వెన్షన్‌ ట్రెజరర్‌ శేఖర్‌ పేర్ల, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ రమేష్‌ బాపనపల్లి, జనరల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ తడకమళ్ల, ట్రెజరర్‌ గంగాధర్‌ ఉప్పల ఆధ్వర్యంలో ఇతర బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ మరియు వివిధ కమిటీలు ఈ కార్యక్రమాల విజయవంతానికి సహకరించాయి. కన్వెన్షన్‌ మెయిన్‌ స్టేజ్‌ పై శ్రీ శివ పార్వతుల కళ్యాణం వైభోగంగా నిర్వహించారు పండితులు. పూజ ప్రాశస్త్యాన్ని విపులంగా వివరిస్తూ శ్రీ శివ పార్వతుల కల్యాణాన్ని వీనుల విందుగా, భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అలాగే శ్రీ శివ పార్వతులను కన్వెన్షన్‌ సెంటర్‌లో ఊరేగించారు.  మాట్రిమోనీ, బిజినెస్‌ సెషన్‌, ఉమెన్స్‌ ఫోరమ్‌, స్టాక్స్‌, ఆర్ధిక సదస్సు, ఇమ్మిగ్రేషన్‌ సదస్సు, యూత్‌ ఎంట్రప్రెన్యూర్‌ సెషన్‌, రియల్‌ ఎస్టేట్‌, పొలిటికల్‌ డిస్కషన్‌, పూర్వ విద్యార్థుల సమ్మేళనం, బ్యూటీ పేజియంట్‌ పోటీలు నిర్వహించారు. పొలిటికల్‌ మీట్‌ లో తెలంగాణ నుంచి 2019 లో ఖమ్మం ఎంపీగా పోటీ చేసిన బీజేపీ  నేత దేవకి వాసుదేవ రావు, తమిళనాడు బీజేపీ స్టేట్‌ సెక్రెటరీ డా. సూర్య మరియు తెలంగాణ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ కలిమిచెర్ల తదితరులు పాల్గొన్నారు. మెయిన్‌ స్టేజీపై వీగాట్‌ టాలెంట్‌ సింగింగ్‌ పోటీల ఫైనల్స్‌ నిర్వహించారు.  తెలుగు టీవీ యాంకర్‌ వర్షిణి  మరియు సమీరా  అందరికీ వార్మ్‌ వెల్కమ్‌ అంటూ సాయంత్రం కార్యక్రమాలను ప్రారంభించారు. 

అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి ఏవీ ప్రదర్శించగా, సభికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, సేవాకార్యక్రమాలు, తన అనుభవాలను, అందరి సహకారాన్ని గురించి ప్రసంగించారు. పుస్తక మిత్ర, గ్రంధాలయాలు ఏర్పాటు, అడాప్ట్‌ ఏ స్టూడెంట్‌ వంటి NRIVA సిగ్నేచర్‌ ప్రాజెక్ట్స్‌ గురించి, తన కుటుంబం అందించిన సపోర్ట్‌ గురించి వివరించారు. ఇంత చక్కని ప్లాట్ఫామ్‌ ఏర్పాటుచేసి తనకి అవకాశం ఇచ్చినందుకు ఎన్నారై విఎ వ్యవస్థాపకులు ఆనంద్‌ గార్లపాటి మరియు విజయ్‌ చావా లకు ధన్యవాదాలు తెలిపారు. డా. విజయ్‌ గుప్తా మొదడుగు ని వేదికపైకి సాదరంగా తోడ్కొని వచ్చి జీవిత సాఫల్య పురస్కారంతో కమిటీ సభ్యులంతా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డా. విజయ్‌ గుప్తా మొదడుగు సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. వివేక్‌ సండ్రపాటి, బృహత్‌ సోమ, శీర్ష సాయి పొన్నూరు ల ప్రతిభను గుర్తిస్తూ యూత్‌ ఎక్సలెన్స్‌ అవార్డ్స్‌ అందించారు. కన్వెన్షన్‌ థీ¸మ్‌ సాంగ్‌ కంపోజ్‌ చేసిన కార్తీక్‌ కొడకండ్ల ని పుష్పగుచ్చం, శాలువాతో సన్మానించారు. జితేంద్ర వివిధ సినీ నటుల గొంతుకు అనుకరిస్తూ మిమిక్రీ చేసి అలరించారు. మిస్సోరి రాష్ట్ర సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ జాన్‌ ఆష్క్రోఫ్ట్‌ జులై 5ని ఎన్నారై వాసవి అసోసియేషన్‌ డే గా ప్రకటిస్తూ ప్రొక్లమేషన్‌ అందిండం విశేషం. ఈ సందర్భంగా తను ప్రసంగిస్తూ సంస్థ సేవలను అభినందించారు. అధ్యక్షులు శ్రీనివాస రావు పందిరి జాన్‌ ఆష్క్రోఫ్ట్‌ కి మిస్సోరి గవర్నర్‌ అయ్యే విషయంలో గుడ్‌ లుక్‌ అంటూ విషెస్‌ తెలిపారు. ప్రస్తుత ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ రమేష్‌ బాపనపల్లి  రాబోయే 2025-26 కాలానికి అధ్యక్షునిగా తన బోస్టన్‌ టీంతో ఉల్లాసంగా వేదికపైకి విచ్చేశారు. రమేష్‌ బాపనపల్లి మాట్లాడుతూ కన్వెన్షన్‌ టీం ని, శ్రీనివాస రావు పందిరిని, కమిటీస్‌ని అభినందించారు.

ఇళయరాజా లైవ్‌ మ్యూజికల్‌ కాన్సర్ట్‌ అందరినీ ఉత్సాహపరిచింది. ఇళయరాజా ఆహ్వానితులను సంగీత ప్రపంచంలో తెలియాడేలా చేశారు. తన బ్లాక్బస్టర్‌ పాటలతో, తన ట్రూప్‌ అంతా కలిసి కన్వెన్షన్‌కి ఊపు తెచ్చారు. జులై 6 తేదీన కూడా ఉదయం యోగా, మెడిటేష సెషన్స్‌తో ప్రారంభమైంది. గురుదేవ్‌ శ్రీ శ్రీ రవి శంకర్‌ ఆధ్యాత్మిక సందేశం అందరి మనసులను తాకింది. హూస్టన్‌, డల్లాస్‌, మేరీల్యాండ్‌, అట్లాంటా, న్యూ జెర్సీ, ఫీనిక్స్‌ చాఫ్టర్స్‌ నుంచి పోటాపోటీగా ప్రదర్శించిన నృత్యాలు, ఫ్యాషన్‌ వాక్‌, థీమ్‌ డాన్స్‌ వేటికవే సాటి అనేలా కనిపించాయి. జబర్దస్త్‌ వెంకీ మంకీ కామెడీ, బిగ్‌ బాస్‌ రతిక డాన్స్‌, రోబో గణేష్‌  ప్రత్యేక నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఈ కన్వెన్షన్‌ నిర్వహించిన మూడు రోజులను కూడా ఎన్నారైవిఎ డేస్‌ గా అధికారికంగా గుర్తిస్తూ సెయింట్‌ లూయిస్‌ కౌంటీ ప్రతినిధి ప్రొక్లమేషన్‌ ని ఎన్నారైవిఎ నాయకులకు అందజేయడం విశేషం. టాలీవుడ్‌ ప్రముఖులు అయిన నటి అంజలి, సినీ నిర్మాత విశ్వ ప్రసాద్‌, కొరియోగ్రాఫర్‌ శివ, మాజీ ఎమ్మెల్యే, సినీ నిర్మాత అంబికా కృష్ణ  , బీజేపీ నేత దేవకి వాసుదేవరావు తదితరులను వ్యాఖ్యాత సమీర స్టేజ్‌ పైకి ఆహ్వానించి సత్కరించారు.  త్రీరీ బ్యాండ్‌ సంగీత విభావరి అలరించింది.  
 

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :