ASBL Koncept Ambience
facebook whatsapp X

డెట్రాయిట్‌లో ఘనంగా జిటిఎ బతుకమ్మ-దసరా వేడుకలు

డెట్రాయిట్‌లో ఘనంగా జిటిఎ బతుకమ్మ-దసరా వేడుకలు

గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్‌ (జీటీఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ-దసరా వేడుకలు ఫార్మింగ్టన్‌ హిల్స్‌లోని  ‘ది స్టూడియోలో’ ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ ఉత్సవం తెలంగాణ సంస్కృతి, పద్ధతులు ఆచారాలకు ప్రతిబింబంలా నిలిచింది. ఈ సందర్భంగా అందమైన బతుకమ్మను రూపొందించిన మహిళలకు నిర్వాహకులు పలు బహుమతులను అందించారు. వివిధ సంఘాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో హాజరు కావటం నిర్వాహకులకు మరింత స్ఫూర్తినిచ్చింది. ఈ కార్యక్రమానికి వెయ్యి మందికి పైగా తెలుగు ప్రవాసులు హాజరయ్యారు. ఈ ఉత్సవం తెలంగాణ సంస్కృతి, పద్ధతులు ఆచారాలకు ప్రతిబింబంలా నిలిచింది. ఈ సందర్భంగా అందమైన బతుకమ్మను రూపొందించిన మహిళలకు నిర్వాహకులు పలు బహుమతులను అందించారు. వివిధ సంఘాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో హాజరు కావటం నిర్వాహకులకు మరింత స్ఫూర్తినిచ్చింది. ఈ అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం వెనుక గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్‌ డెట్రాయిట్‌ చాప్టర్‌ వారు చేసిన కృషిని పలువురు ప్రశంసించారు.

భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలు అమెరికాలోనూ జరుగుతాయని తాను ఊహించలేదని, తన బాల్య జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చిందని, మొదటిసారి అమెరికాకు వచ్చిన మిర్యాలగూడకు చెందిన త్రిలోచన పల్లవి సంతోషం వ్యక్తం చేశారు. ‘మన తర్వాత తరాల పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయాలతో అనుసంధానం కావడానికి ఈ కార్యక్రమం మంచి అవకాశం కల్పించింది’ అని హైదరాబాద్‌ నుంచి వచ్చిన కుడికాల జయసాగర్‌ అన్నారు. మంజిల్‌ డిజైన్స్‌, హరి కాకుమాను, యాదగిరి ఇలేని (కమ్యూనిటీ ఛాయిస్‌ రియాల్టీ అసోసియేట్స్‌), సోమిరెడ్డి లా గ్రూప్‌, ఎన్శూర్‌ (సాయిలీల), సాఫ్ట్కార్ప్‌ ఐటి, తబ్లా రెస్టారెంట్‌, డిలైట్‌ కన్సల్టింగ్‌ సర్వీసెస్‌, వికెటెక్‌ ఇంక్‌ ఇతర తెలంగాణ తెలుగు కుటుంబాలు స్వచ్ఛందంగా సమర్పించిన విరాళాలతో ఈ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. అత్యంత అందమైన బతుకమ్మల రూపకల్పనకుగానూ నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు.

జీటీఏ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్‌ కేసిరెడ్డి ఆధ్వర్యంలో డెట్రాయిట్‌ సిటీ చాప్టర్‌ బృందం అధ్యక్షుడు కమల్‌ పిన్నమరెడ్డి, ప్రెసిడెంట్‌-ఎలెక్ట్‌ వెంకట్‌ వడ్నాల, స్వప్న చింతపల్లి, సుష్మా పడుకోన్‌, సుమ కలువల, దీప్తి చిత్రపులతో కూడిన జీటీఏ-వనిత బృందం ఈ కార్యక్రమాన్ని నెలరోజుల పాటు పకడ్బందీగా ప్రణాళిక రచించి విజయవంతం చేశారు. ఇతర జాతీయ బోర్డు సభ్యులైన కృష్ణ ప్రసాద్‌ జలిగామ, మహేష్‌ వెనుకదాసుల, మల్లిక్‌ పడుకోన్‌, సంతోష్‌ కాకులవరం, డెట్రాయిట్‌ కార్యవర్గ సభ్యులు ప్రేమ్‌ చింతపల్లి, సాయినాథ్‌ లచ్చిరెడ్డిగారి, యాదగిరి ఐలేని, శ్రీరామ్‌ రెడ్డి జాల, లక్ష్మీనారాయణ కర్నాల, సందీప్‌ నారాయణప్ప, శ్రీకాంత్‌ రెడ్డి చింతల, సత్యధిర్‌ గంగసాని, కరుణాకర్‌ కందుకూరి, ప్రవీణ్‌ ముద్దసానిలతో పాటు 50 మందికి పైగా వాలంటీర్లు, ప్రధానంగా వినోద్‌ ఆత్మకూర్‌, అశోక్‌ వెల్దండి, బద్రీనారాయణ, నవదీప్‌ వెంపటి, యుగంధర్‌ భూమిరెడ్డి, అరుణ్‌ బచ్చు, రాహుల్‌ పాల్రెడ్డి, అభిలాష్‌ రెడ్డి భూమిరెడ్డి, ప్రణయ్‌ వుల్పాల, శ్రీకాంత్‌ రెడ్డి రాజు, శ్రవణ్‌ కుమార్‌ అరెల్ల, దుర్గ ప్రసాద్‌ శ్రీరాం, రవి తిప్పిరెడ్డి తదితరులు పూర్తి సహాయసహకారాలు అందించారు. 

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :