ASBL Koncept Ambience
facebook whatsapp X

రూటు మార్చేసిన గుణ‌శేఖ‌ర్

రూటు మార్చేసిన గుణ‌శేఖ‌ర్

ఈ కాలానికి త‌గ్గ‌ట్టు, ఆడియ‌న్స్ అభిరుచికి త‌గ్గ‌ట్టు త‌మ‌ను తాము మౌల్డ్ చేసుకోలేక త్వ‌ర‌గా రిటైర్ అవుతున్న డైరెక్ట‌ర్ల లిస్ట్ టాలీవుడ్ లో చాలా పెద్ద‌గానే ఉంది. చూడాలని ఉంది(Chudalani Undi), ఒక్క‌డు(Okkadu) లాంటి ఆల్ టైమ్ క్లాసిక్స్ ఇచ్చిన గుణ‌శేఖ‌ర్(Guna Sekhar) కూడా గ‌త కొంత‌కాలంగా రొటీన్ సినిమాలే తీయ‌డంతో ఆయ‌న రిటైర్‌మెంట్ ద‌గ్గ‌ర్లోనే ఉంద‌నుకున్నారంతా.

కానీ ఇప్పుడాయ‌న త్వ‌ర‌లోనే యుఫోరియా(Euphoria) సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా టీజ‌ర్ ను రిలీజ్ చేసి కాన్సెప్ట్ ను తెలియ‌చేశారు. టేకింగ్ చూస్తుంటేనే గుణశేఖ‌ర్ ట్రెండ్‌ను ఏ రేంజ్ లో ఫాలో అవుతున్నాడో అర్థ‌మ‌వుతుంది. కాలేజ్ యూత్, డ్ర‌గ్స్ వాడ‌కం, లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఇలా స‌మాజంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌ను హైద‌రాబాద్ బ్యాక్ డ్రాప్ లో రాసుకుని దీన్ని తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది.

సినిమాల‌కు తెలుగు పేర్లు పెడితే అర్థం చేసుకోలేని సిట్యుయేష‌న్ లో ఉన్నామ‌ని, ముందుగా ఈ సినిమాకు ఉద్వేగం(Udvegam) అని టైటిల్ ను అనుకున్నామ‌ని, కానీ అంద‌రూ దాన్ని వద్ద‌ని చెప్ప‌డంతో యుఫోరియా గా మార్చిన‌ట్లు చెప్పాడు. అంతేకాదు ఇందులో ఇప్ప‌టి ఆడియ‌న్స్ సినిమా నుంచి ఏం కోరుకుంటున్నారో అదే ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు గుణ‌శేఖ‌ర్ మాటల్లో అర్థ‌మవుతోంది. చూస్తుంటే శాకుంత‌లం(saankunthalam) నేర్పించిన గుణ‌పాఠాన్ని గుణ‌శేఖ‌ర్ చాలా త్వ‌ర‌గానే అర్థం చేసుకున్న‌ట్లున్నాడు. ఈ సినిమా హిట్ అయితే ఇలాంటి త‌ర‌హా సినిమాలే ఆయ‌న్నుంచి మ‌రిన్ని వ‌చ్చే అవ‌కాశ‌ముంది.  

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :