రిషితేశ్వరి కేసును కొట్టివేసిన గుంటూరు జిల్లా కోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందన్న న్యాయస్థానం కేసును కొట్టివేసింది. వివారాల్లోకి వెళితే ర్యాగింగ్, వేధింపుల వల్ల 2015 జులై 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసింది. అప్పట్లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆమె స్వస్థలం తెలంగాణలోని వరంగల్. గుంటూరు కోర్టులో తొమ్మిదేళ్లపాటు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది.
Tags :