ASBL Koncept Ambience
facebook whatsapp X

శ్రీవిష్ణు 'శ్వాగ్' నుంచి రెట్రో బీట్స్ 'గువ్వ గూటిలో' సాంగ్ రిలీజ్

శ్రీవిష్ణు 'శ్వాగ్' నుంచి రెట్రో బీట్స్ 'గువ్వ గూటిలో' సాంగ్ రిలీజ్

కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబో 'శ్వాగ్' హిలేరియస్ టీజర్‌తో అందరినీ మెస్మరైజ్  చేశారు. టీజర్‌లో శ్రీవిష్ణు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో, డిఫరెంట్ టైమ్‌లైన్‌లలో అద్భుతంగా ఆలరించారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ సింగరో సింగ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్- గువ్వ గూటిలో విడుదల చేశారు. యయాతి డాన్స్ ట్రూప్ హెడ్ గా శ్రీవిష్ణు అదరగొట్టారు. ఈ పాట 80, 90ల స్టయిల్ విజువల్ ఎసెన్స్, రెట్రో బీట్‌లు, స్టైలిష్ కొరియోగ్రఫీతో వింటేజ్ నాస్టాల్జిక్ డైవ్ ప్రజెంట్ చేస్తోంది.

వివేక్ సాగర్  రెట్రో-కంపోజింగ్, భువన చంద్ర ఆకట్టుకునే లిరిక్స్ కంప్లీట్ చేశాయి. మనో, గీతా మాధురి, స్నిగ్ధా శర్మల డైనమిక్ వోకల్స్ తో ఎనర్జిటిక్ గా పాడారు, ట్రాక్ కన్నుల విందుగా ఉంది.  రెట్రో-స్టైల్ డ్యాన్స్ మూవ్‌లకు శిరీష్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు.

కలర్ ఫుల్ జాతర నేపథ్యంలో సెట్ చేయబడిన గువ్వ గూటిలో సాంగ్ ప్రత్యేకించి గణేష్ చతుర్థి పండక్కి ట్రీట్ కాబోతోంది.

ఈ చిత్రంలో రీతూ వర్మ హీరో  నటిస్తుండగా, మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ కాగ, నందు మాస్టర్ స్టంట్స్‌ నిర్వహిస్తున్నారు.

శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.  

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :