ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. గయానా, డొమినికా దేశాలు అయనను అతమ అత్యున్నత జాతీయ పురస్కారాలతో సత్కరించాయి. కొవిడ్`19 మహమ్మారి ఉధృతి సమయంలో అందించిన సహాయంతో పాటు ప్రపంచ సౌభాగ్యానికి, తమ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను అత్యున్నత పురస్కారాలను ప్రదానం చేశాయి. గయనా రాజధాని జార్జిటౌన్‌లో గయనా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ మోదీకి ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. అంతకంటే ముందు డొమినికా అధ్యక్షుడు సిల్వానీ బర్టన్ డొమినికా అవార్డు ఆఫ్ హానర్ తో మోదీని సన్మానించారు. రెండు కరీబియన్ దేశాల అత్యున్నత పురస్కారాలు తనకు లభించడం పట్ల ప్రధానమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఈ రెండు పురస్కారాలను 140 కోట్ల మంది భారతీయులకు, ఆయా దేశాలతో కొనసాగుతున్న చరిత్రాత్మక ద్వైపాక్షిక సంబంధాలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.