ట్రాక్ లోకి వచ్చిన కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్
టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ల కొరత బాగా ఎక్కువైపోయింది. తమన్(Thaman), దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ఈజీగా దొరకడం లేదు. అనూప్(Anoop Rubens), మణిశర్మ(Manisharma) లాంటి వారిని తీసుకుంటే ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వలేకపోతున్నారనే కామెంట్ వినబడుతుంది. అందుకే ఇప్పుడు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు తప్ప మరో ఆప్షన్ లేదు.
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) ను తీసుకుంటే తనకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు గట్టిగానే వెళ్తున్నాయి. గతేడాది టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara rao), ఆదికేశవ(Adikeshava) సినిమాలు చేసినప్పటికీ వాటికి ఛార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇవ్వలేకపోయాడు. ఆ సినిమాలు కూడా రెండూ ఫ్లాపే. అయితే ఇప్పుడు జీవీ ప్రకాష్ తనను తాను ప్రూవ్ చేసుకున్నట్లే అనిపిస్తోంది.
ఈ దీపావళికి అతన్నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి లక్కీ భాస్కర్(Lucky Baskhar) కాగా మరోటి అమరన్(Amaran). లక్కీ భాస్కర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మంచి అవుట్‌పుట్ ఇచ్చాడని అందరూ మెచ్చుకున్నారు. సాంగ్స్ కూడా డీసెంట్ గా బావున్నాయి. ఇక అమరన్ సోల్ ను ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా నేపథ్య సంగీతాన్ని అందించడంలో జీవీ సూపర్ సక్సెస్ అయ్యాడు. జీవీ నుంచి నెక్ట్స్ కూడా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రానున్నాయి. వరుణ్ తేజ్(Varun tej) మట్కా(matka) నవంబర్ 14న రిలీజ్ కానుండగా ఆ తర్వాత నెల లోపే నితిన్(Nithin) రాబిన్ హుడ్(Robbin Hood) డిసెంబర్ 20 రిలీజ్ కానుంది.