ASBL Koncept Ambience
facebook whatsapp X

జిడబ్ల్యుటీసిఎస్‌ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డు గ్రహీతలు వీరే....

జిడబ్ల్యుటీసిఎస్‌ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ అవార్డు గ్రహీతలు వీరే....

బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం (జిడబ్ల్యుటీసిఎస్‌) స్వర్ణోత్సవ వేడుకలు సెప్టెంబర్‌ 27, 28 తేదీల్లో  అంగరంగ వైభవంగా లీస్‌ బర్గ్‌లోని ద్రోమవల్ల ఫామ్‌ 14980లో జరగనున్నది. ప్రస్తుతం సంఘం అధ్యక్షునిగా ఉన్న కృష్ణ లాం స్వర్ణోత్సవ వేడుకలను ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి బిజినెస్‌ ఎక్సలెన్స్‌ పురస్కారాలను ఇవ్వనున్నట్లు కృష్ణలాం తెలిపారు. వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

శ్రీ అనిల్‌ పాటిబండ్ల (బిజినెస్‌), శ్రీ అంజన్‌ చిమలదిన్నె (రాజకీయం) శ్రీ అశ్విన్‌ పుప్పాల (యూత్‌ బిజినెస్‌), శ్రీ చిన్న బాబు గుడపాటి (ఎంట్రప్రెన్యూరర్‌), శ్రీ గౌతమ్‌ అమర్నేని (ఐటీ) శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ (జిడబ్ల్యుటిసిఎస్‌ అధ్యక్ష పురస్కారం), శ్రీమతి జయప్రద వల్లూరుపల్లి (మహిళ), శ్రీమతి జయశ్రీ గంప (ఉమెన్‌ ఎంట్రప్రెన్యూరర్‌), శ్రీమతి కల్పనా తమ్మినేని (వైద్య రంగం) శ్రీ మధుసూధన్‌ రెడ్డి కాశిపతి (దేశ సేవ), శ్రీ నాగ్‌ నెల్లూరి (ప్రైమరీ విద్య), శ్రీ రవి వెనిగళ్ల (సామాజిక సేవ), శ్రీమతి సాయికాంత రాపర్ల (జిడబ్ల్యుటీసిఎస్‌ సేవ). శ్రీమతి సంధ్య బైరెడ్డి (కళలు). 

శ్రీ సంతోష్‌ రెడ్డి సోమి రెడ్డి (న్యాయ). శ్రీ శ్రీధర్‌ చిల్లర (మీడియా), శ్రీ శ్రీనివాస్‌ చావలి (రియల్‌ ఎస్టేట్‌), శ్రీ శ్రీనివాస్‌ వెంపటి (వ్యవసాయ రంగం), శ్రీమతి తనూజ గుడిసేవ (తెలుగు సాహిత్య ప్రోత్సాహం), శ్రీ వాసుబాబు గోరంట్ల (రూరల్‌ ఎడ్యుకేషన్‌, ఎంపవర్‌మెంట్‌), శ్రీ వేణు నక్షత్రం (సాహిత్య రంగం) లకు అవార్డులను ప్రకటించారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :