ASBL Koncept Ambience
facebook whatsapp X

జిడబ్ల్యుటీసిఎస్‌ స్వర్ణోత్సవ వేడుకలకు అంతా సిద్ధం

జిడబ్ల్యుటీసిఎస్‌ స్వర్ణోత్సవ వేడుకలకు అంతా సిద్ధం

అమెరికా రాజధాని వేదికగా బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం (జిడబ్ల్యుటీసిఎస్‌) స్వర్ణోత్సవ వేడుకలకు అంతా సిద్ధమైంది. సెప్టెంబర్‌ 27, 28 తేదీల్లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా లీస్‌ బర్గ్‌లోని ద్రోమవల్ల ఫామ్‌ 14980లో జరగనున్నది. యాభై సంవత్సరాల క్రితం (1974) అమెరికాలో ఏ ఆశయంతో ఐతే ఆనాడు పెద్దలు ఉన్నత మార్గదర్శకాలతో ఈ సంస్థను స్థాపించారో నాటి నుంచి నేటి వరకు జిడబ్ల్యుటీసిఎస్‌ ప్రస్థానం అవిశ్రాంతంగా కొనసాగుతోంది. మాతృ దేశానికి దూరంగా వున్నా.. ఏదేశ మేగినా, ఏ రంగంలో కాలిడినా మన జాతి ఔన్నత్యాన్ని చాటుకోవటం మనందరి సమిష్టి భాద్యత అని నేడు సంఘానికి అధ్యక్షునిగా ఉన్న కృష్ణ లాం సంఘానికి పేరు ప్రతిష్టలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నా రు. తన హయాంలో జిడబ్ల్యుటీసిఎస్‌ స్వర్ణోత్సవ వేడుకలు జరగడం సంతోషకరంగా ఉందంటూ, ఈ వేడుక లను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకలకోసం తొలుత స్వర్ణోత్సవ లోగోను పెద్దల సమక్షంలో ఆవిష్కరించి కార్యక్రమ సన్నాహాలను మొదలు పెట్టారు.

వివిధ కమిటీల నియామకం

ఈ వేడుకల కోసం వివిధ కమిటీలను నియమించారు. బాంక్వెట్‌ కమిటీకి చైర్‌గా చంద్ర మాలావతు, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ చైర్‌గా అనిల్‌ కాసినేని, కల్చరల్‌ చైర్‌గా సుష్మ అమృతలూరి, ఎగ్జిబిట్స్‌ చైర్మన్‌గా మురళీ చలసాని, ఫైనాన్స్‌ కమిటీ చైర్‌గా రాజ్‌ బొమ్మదేని, ఫుడ్‌ కమిటీ చైర్‌గా చంద్రమోహన్‌ బేవర, హాస్పీటాలిటీ చైర్‌గా సుధీర్‌ కొమ్మి, ఇనాగురల్‌ కమిటీ చైర్‌గా సాయికాంత లక్ష్మీ రాపర్ల, మెట్రిమోనియల్‌ కమిటీ చైర్‌గా రామకృష్ణ బొల్లు, మీడియా కమిటీ చైర్‌గా రాజా బోయపాటి, రిజిస్ట్రేషన్‌ కమిటీ చైర్‌గా రాకేశ్‌ గౌరినేని, రిలీజియస్‌ కమిటీ చైర్‌గా సుబ్బు వారణాసి, సెక్యూరిటీ కమిటీ చైర్‌గా శివాజీ మేడికొండ, సావనీర్‌ కమిటీ చైర్‌గా శివ సత్యనారాయణ మొవ్వ, స్ప్రిట్యువల్‌ కమిటీ చైర్‌గా కృష్ణ గూడిపాటి, స్పోర్ట్స్‌ కమిటీ చైర్‌గా సురేంద్ర ఓంకారం, స్టేజ్‌ కమిటీ చైర్‌గా శశాంక్‌ పడమటి, ట్రాన్స్‌ పోర్ట్‌ గెస్ట్‌ రిలేషన్స్‌ కమిటీ చైర్‌గా హర్ష తొండపు, వెన్యూ కో ఆర్డినేషన్‌ కమిటీ చైర్‌గా సునీత గొట్టిముక్కల, వెబ్‌ అండ్‌ సోషల్‌ మీడియా కమిటీ చైర్‌గా యువ సిద్ధార్థ బోయపాటి ఉన్నారు.

ప్రముఖుల రాక

ఈ స్వర్ణోత్సవ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎపి హోంమంత్రి అనిత వంగలపూడి, ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ నరేంద్రకుమార్‌ ధూళిపాళ్ళ, పలువురు సినిమా కళాకారులు అలీ, సందీప్‌ రెడ్డి వంగ, శర్వానంద్‌, అంజలి వస్తున్నారు. 

ఈ వేడుకలను పురస్కరించుకుని మణిశర్మ సంగీత విభావరిని 28వ తేదీన ఏర్పాటు చేశారు. ఉమ నేహ, వర్షిణి సౌందర్యరాజన్‌, ధనుంజయ్‌, శ్రీకృష్ణ, గీత మాధురి, వైష్ణవి, భార్గవి లావణ్య తదితరులు ఈ సంగీత విభావరిలో పాల్గొని పాటలను పాడనున్నారు. యాంకర్‌ ఉదయభాను కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. సాహితీవేత్తలు రామ జోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సత్యవాణి భారతీయం పాల్గొంటున్నారు. గుమ్మడి గోపాలకృష్ణ ప్రత్యేకంగా నాటికను వేయబోతున్నారు.

27వ తేదీన లైవ్‌ బాండ్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనిరుధ్‌ సుస్వరం, అమలచేబోలు ఈ కార్యక్రమంలో పాటలను పాడనున్నారు. 

వివిధ పోటీలు

వాషింగ్టన్‌ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్‌ స్వర్ణోత్సవా లను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. జీడబ్ల్యూటీసీఎస్‌ అందాల పోటీలకు, ఆట, పాట పోటీల్లో ఎంతోమంది పాల్గొని విజయవంతం చేశారు. కల్చరల్‌ గాలా పేరుతో గోల్డెన్‌ వాయిస్‌ పోటీలను సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల వారీగా పోటీలలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందించారు. 

డాన్సింగ్‌ సూపర్‌స్టార్‌ పేరుతో నిర్వహించిన పోటీల్లో కూడా ఎంతోమంది పాల్గొన్నారు. సబ్‌ జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి ఆగస్టు 25వ తేదీన విల్లార్డ్‌ మిడిల్‌ స్కూల్‌ లో ఈ పోటీలు జరిగాయి. వివిధ పోటీల్లో పాల్గొనేం దుకు వచ్చిన వివిధ వయస్సులవారీతో వేదిక జరిగి ప్రాంతం సందడిగా కనిపించింది. అలాగే వివిధ పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి గెలుపొందిన వారికి బహుమతులను అందించారు 
ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్‌ అధ్యక్షుడు కృష్ణ లాం మాట్లాడుతూ ఈ పోటీలకు వచ్చిన స్పందన చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. వివిధ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచిన వారందరినీ ఆయన అభినందించారు. సెప్టెంబర్‌ 27,28 తేదీల్లో జరిగే జిడబ్ల్యూటిసిఎస్‌ స్వర్ణోత్సవ వేడుకలకు కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ పోటీలను చక్కగా నిర్వహించిన కల్చరల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సుష్మ అమృతలూరి, సెక్రటరీ (కల్చరల్‌) శ్రీవిద్యా సోమ.. వారి టీం గణేష్‌ ముక్క నంద చెల్లువేది అమర్‌ అతికం, శ్రావణి వింజమూరి, నివేదిత చంద్రుపట్ల, శిరీష, పావని పూదోట తదితరుల సేవలను కృష్ణ లాం కొనియాడారు. ఈ పోటీల్లో గెలిచిన వాళ్ళందరికీ బహుమతులు అందజేశారు. ఈ పోటీలకు పలువురు జడ్జీలుగా వ్యవహరించారు. సింగింగ్‌ పోటీలకు తరుణ్‌ దోనిపాటి, భార్గవ్‌ హల్కూర్‌ చంద్రశేఖర్‌, షకీరా బేగం, బ్యూటీ పేజియంట్‌ పోటీలకు సాయి సుధ పాలడుగు, మీనాల్‌ మణికందన్‌, అనుపమ సత్యవోలు, క్లాసికల్‌ డ్యాన్స్‌కు ఇంద్రాణి దావులూరి, కుసుమరావు, సాయికాంత లక్ష్మీరాపర్ల, నాన్‌ క్లాసికల్‌ డ్యాన్స్‌కు ప్రత్యూష కుర్ర, నవ్య ఆలపాటి, షకీరా బేగం జడ్జీలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు.

అందరూ రండి.. వేడుకలను తిలకించండి: కృష్ణ లాం

బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం (జిడబ్ల్యుటీసిఎస్‌) స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ‘తెలుగు టైమ్స్‌’కు సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...

స్వర్ణోత్సవ వేడుకలకు చేసిన ఏర్పాట్లు వివరిస్తారా?

సెప్టెంబర్‌ 27, 28 తేదీల్లో నిర్వహించే ఈ స్వర్ణోత్సవ వేడుకలకోసం ఏర్పాట్లు భారీగానే చేశాము. ఆరునెలలకు ముందే ఈ ఈవెంట్‌కోసం అవసరమైన కసరత్తులను ప్రారంభించాము. జిడబ్ల్యుటీసిఎస్‌ వైభవాన్ని తెలిపేలా స్వర్ణోత్సవ లోగోను తయారు చేశాము. అలాగే వేడుకల నిర్వహణకోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేశాము. కమ్యూనిటీని ఈ వేడుకల్లో పాలుపంచుకునేందుకు వీలుగా ఆటల పోటీలను, పాటల పోటీలను, అందాల పోటీలను ఏర్పాటు చేసి నిర్వహించాము. ఈ పోటీలకు ఎంతోమంది హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆటల పోటీలను కూడా ఏర్పాటు చేసి నిర్వహించాము. వాలీబాల్‌, ఉమెన్స్‌ వాలీబాల్‌, ఉమెన్స్‌ త్రోబాల్‌, బ్యాడ్మింటన్‌ పోటీలను నిర్వహించాము. ఇందులో ఎన్నో టీమ్‌లు పాల్గొన్నాయి. విజేతగా నిలిచిన టీమ్‌లకు బహుమతులను అందజేశాము. ఈ పోటీలకు వచ్చినవారందరినీ స్వర్ణోత్సవ వేడుకలకు రావాల్సిందిగా కోరడం జరిగింది.

ఈ వేడుకలకు ఎవరెవరు వస్తున్నారు?

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురిని ఆహ్వానించాము. రాజకీయరంగం నుంచి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎపి హోంమంత్రి అనిత వంగలపూడి, ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ నరేంద్రకుమార్‌ ధూళిపాళ్ళ తదితరులు వస్తున్నారు. సినిమా రంగం నుంచి అలీ, సందీప్‌ రెడ్డి వంగ, శర్వానంద్‌, అంజలి తదితరులు వస్తున్నారు. 

మరిన్ని విశేషాలు తెలపండి?

ఈ వేడుకల్లో భాగంగా మణిశర్మ సంగీత విభావరిని ఏర్పాటు చేశాము. ఈ విభావరిలో పలువురు నేపథ్య గాయనీ గాయకులు తమ పాటలతో అందరినీ ఆకట్టుకోనున్నారు. అలాగే లైవ్‌ బాండ్‌ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. 

తెలుగు టైమ్స్‌ ద్వారా మీరు ఏమి చెప్పనున్నారు?

ఒక అసోసియేషన్‌ గత 50 సంవత్సరాలుగా సేవ చేసున్నదంటే అదీ మామూలు విషయం కాదు. ఈ 50 సంవత్సరాలలో ఎంతోమంది అధ్యక్షులు, ఎంతోమంది కార్యవర్గ సభ్యులు చేసిన సేవ మరిచిపోకుండా వారిని స్మరించుకుంటూ వారు అందించిన సేవా కార్యక్రమాలను మరింతగా కొనసాగించేందుకు వీలుగా ఈ స్వర్ణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈ వేడుకలకు అందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :