ASBL Koncept Ambience
facebook whatsapp X

విరాళం తిరస్కరించారు మరి .. ఒప్పందాల సంగతేంటి?

విరాళం తిరస్కరించారు మరి .. ఒప్పందాల సంగతేంటి?

యంగ్‌ ఇండియా స్కిల్స్‌ వర్సిటీకి అదానీ గ్రూప్‌ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నట్లు  తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. అదానీ విరాళం తిరస్కరించారు సరే, మరి ఒప్పందాల సంగతేంటని ప్రశ్నించారు. దావోస్‌లో అదానీతో చేసుకున్న రూ.12,400 కోట్ల  ఒప్పందాల సంగతేంటి? డిస్కంలను అదానీ సంస్థల పరం చేస్తున్న కుట్రల మాటేమిటి? 20 వేల మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌ పెడతామని అదానీ వస్తే మేం మర్యాదగా తిరస్కరించాం. కానీ, కాంగ్రెస్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. అదానీ అవినీతి బయటకు రాగానే ఇప్పుడు మాట మార్చారు. అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :