తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులకు.. బిగ్ షాక్
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు ఉగ్యోగులను క్రమబద్ధీకరించారని, ప్రభుత్వ నిర్ణయాన్ని నిరుద్యోగులు హైకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు ఇది విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. విచారణ చేపట్టిన హైకోర్టు జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 40 విభాగాల్లో 5,444 కాంట్రాక్టు ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Tags :