వివేకా హత్య కేసు ... ఉమాశంకర్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ3గా ఉన్న ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఉమాశంకర్ రెడ్డి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఉమాశంకర్ రెడ్డిని ప్రత్యక్ష సాక్షి గుర్తించలేదని, పొడవుగా, నల్లగా ఉన్నాడని చెప్పిన మాటల ఆధారంగా ఈ కేసులో నిందితుడిగా చేర్చారని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగానే నిందితుడిని గుర్తించామని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు.






Tags :