ASBL NSL Infratech

'తిరగబడరసామీ' లాంటి మంచి ఎంటర్‌టైనర్ తో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది : మాల్వి మల్హోత్రా  

'తిరగబడరసామీ' లాంటి మంచి ఎంటర్‌టైనర్ తో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా వుంది : మాల్వి మల్హోత్రా  

 

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'తిరగబడరసామీ'. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్ పాటలకు రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

ముందుగా మీ గురించి చెప్పండి? 

-మాది హిమాచల్ ప్రదేశ్. చదువుకోవడానికి ముంబై వెళ్లాను. అక్కడే థియేటర్ ఆర్ట్స్ లో చేరాను. టీవీ ఇండస్ట్రీ నుంచి నా కెరీర్ మొదలైయింది. తర్వాత ఓ హిందీ ఫిల్మ్ చేసే ఛాన్స్ వచ్చింది. అలాగే ఒక మలయాళం, తమిళ్ సినిమా చేశాను. ఇది తెలుగులో నా మొదటి సినిమా. 

ఈ సినిమాలో మీరు బాలకృష్ణ గారి అభిమానిగా కనిపిస్తారు కదా.. మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది ?

-చాలా ఇంట్రస్టింగ్ క్యారెక్టర్. చాలా ఎనర్జిటిక్ హైపర్ యాక్టివ్ అమ్మాయిగా కనిపిస్తాను. నా క్యారెక్టర్ కారణంగానే కథ అంతా జరుగుతుంది. ఇందులో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా వుంటాయి, అలాగే నాకో యాక్షన్ సీక్వెన్స్ కూడా వుంది. అది బాలకృష్ణ గారికి రిలేట్ అయ్యేలా వుంటుంది. బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఫిల్టర్ వుండదు. ఆయన మనసులో వున్నది వున్నట్లుగా మాట్లాడేస్తారు. ఇందులో నా క్యారెక్టర్ కూడా అలానే వుంటుంది. నా క్యారెక్టర్ విమన్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ ప్రాముఖ్యతని నేర్పించేలా వుంటుంది. తొలి సినిమాలోనే యాక్షన్ సీక్వెన్స్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. 

-బాలకృష్ణ గారి సినిమాలు చూస్తుంటాను. అన్ని ఇండస్ట్రీలలో ఆయనకి హ్యుజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఆయన చాలా సరదా వుంటారు. ఆయన గత చిత్రం భగవంత్ కేసరి ని చాలా ఎంజాయ్ చేశాను.  

డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి గారి గురించి ? 

-రవికుమార్ గారు చాలా మంచి విజన్ వున్న డైరెక్టర్. తను ఏదైతే చెప్పారో సరిగ్గా అదే ఎగ్జిక్యూట్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. 

'తిరగబడరసామీ' లో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి? 

-ఇందులో చాలా ఎమోషన్స్, యాక్షన్, డ్రామా, రోమాన్స్, ఫన్ ఇలా ఎలిమెంట్స్ వున్నాయి. ముఖ్యంగా రాజ్ తరుణ్ గారికి క్యారెక్టర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. సైలెంట్ గా మొదలై వైలెంట్ గా మారే క్యారెక్టర్. ఆడియన్స్ ఎంజాయ్ చేసే అన్నీ ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి.

నిర్మాత మల్కాపురం శివకుమార్ గురించి ? 

-శివ గారు వెరీ నైస్ పర్శన్. ఫ్యామిలీ పర్శన్ లా వుంటారు. వాళ్ళ అమ్మాయి నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేసినందుకు ఆయనకి రుణపడి వుంటాను. 

హీరో రాజ్ తరుణ్ గురించి ?

-రాజ్ తరుణ్ చాలా నైస్ పర్శన్. సెట్స్ లో చాలా ఎంటర్ టైనింగ్ గా వుంటారు. చాలా సపోర్టివ్. ఆయనతో వర్క్ చేయడం నైస్ ఎక్స్ పీరియన్స్. 

జెబి మ్యూజిక్ గురించి ? 

-చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. నేపధ్య సంగీతం కూడా సీన్స్ ని ఎలివేట్ చేస్తోంది. 

మకరంద్ దేశ్ పాండే గారితో కలిసి పని చేయడం ఎలా అనిపించింది ? 

-ఆయన గ్రేట్ యాక్టర్. చాలా వినయంగా వుంటారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. 

తెలుగు సినిమాలు చూస్తుంటారా? ఎవరి సినిమాలో పార్ట్ అవ్వాలని కోరుకుంటారు ? 

-చూస్తాను. బొమ్మరిల్లి, ఏం మాయ చేశావా నా ఫేవరేట్ ఫిలిమ్స్. రీసెంట్ గా బేబీ సినిమా చూశాను. రాజమౌళి గారి సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల. అలాగే మణిరత్నం సార్ తో కూడా కలసి పని చేయాలని వుంది. 

టాలీవుడ్ లో మీ ఫేవరేట్ హీరో ? 

-అందరు హీరోలు ఇష్టమే. అయితే ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా యాక్టర్ కళ్ళలో డెప్త్ గురించి మాట్లాడుకుంటే .. నాని గారి పేరు చెప్తాను. తన కళ్ళతో అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్, ఎమోషన్స్ పలికించే యాక్టర్ తను. తనతో వర్క్ చేయడానికి ఇష్టపడతాను. అలాగే మహేష్ బాబు గారు, అడివి శేష్ గారు అంటే ఇష్టం.  

ఎలాంటి సినిమాలు చేయాలనీ కోరుకుంటారు ? 

-అన్ని జోనర్స్ ఇష్టమే. అయితే కథలో ప్రాధాన్యత వున్న పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. 

తెలుగులో కొత్త సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ? 

-కొన్ని ప్రాజెక్ట్స్ వున్నాయి. త్వరలోనే ఫైనల్ అవుతాయి. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :