ASBL Koncept Ambience
facebook whatsapp X

హెజ్ బొల్లా వెన్నువిరిచిన ఇజ్రాయెల్ యూనిట్ 8200 ..!

హెజ్ బొల్లా వెన్నువిరిచిన ఇజ్రాయెల్ యూనిట్ 8200 ..!

తమపై నేరుగా ఇజ్రాయెల్ క్షిపణీ దాడులు చేసినా.. ఇరాన్ ఎందుకు పైపై దాడులకు సరిపుచ్చింది. ఇజ్రాయెల్ తో సరిహద్దుల్లో కాల్పులు జరిగినా లెబనాన్ ఎందుకు సైలెంట్ గానే ప్రతిస్పందిస్తోంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ కాగా.. అందులో మరొకటి యూనిట్ 8200.. ఇటీవల వరుసగా లెబనాన్ లో ప్రేజర్లు, వాకీటాకీలు పేలుళ్ల వెనక దీని హస్తముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇజ్యాయెల్ యూనిట్ 8200.. దీనిపేరు యహిద షమోనే మతాయిమ్ అలియాస్ యూనిట్ 8200.. హెజ్ బొల్లా ఉగ్రవాద సంస్థ కుంభస్థలాన్ని దెబ్బకొట్టడంలో ఈ సంస్థదే ప్రధాన పాత్ర. ఆ సంస్థ అగ్రనేతలు వాడే ప్రేజర్లు, వాకీటాకీలనే అస్త్రాలుగా వాడి విధ్వంసం సృష్టించింది. ఈపరిణామం.. హెజ్ బొల్లా కేడర్ లో గందరగోళం, భయాందోళనలు రేకెత్తించింది. అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, బ్రిటన్ లోని జీసీహెచ్ క్యూతో సమానమైన అత్యాధునిక టెక్నాలజీ కలిగిన సంస్థ యూనిట్ 8200.ఇజ్రాయెల్ లోని మిలటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా సమాచార సేకరణ, సైబర్ డిఫెన్స్ కోసం పనిచేస్తుంది. దానికి అవసరమైన పరికరాలు అభివృద్ధి చేయడం దీని ప్రధాన విధి.

గతంలో అమెరికా సంస్థలతో కలిసి పనిచేసిన చరిత్ర ఈ యూనిట్ 8200కు ఉంది. మరో విషయం ఏమిటంటే.. ఈ యూనిట్ నేరుగా ప్రధానికే రిపోర్ట్ చేస్తుంది. హెజ్ బొల్లా సంస్థలో పెద్దసంఖ్యలో ఫైటర్లున్నారు. వారిని సమన్వయపరిచేందుకు ఓ వ్యవస్థ ఉంది.పాశ్చాత్యదేశాలకు తమ ఆనుపానులు దొరక్కుండా ఈసంస్థ అగ్రనేతలు.. ప్రేజర్లు, వాకీటాకీలు వాడుతుంటారు. అయితే ఇజ్రాయెల్ యూనిట్ పన్నిన పకడ్బందీ వ్యూహంలో భాగంగా... ఒక్కసారిగా ప్రేజర్లు, వాకీటాకీలు పేలిపోయాయి.

అంతేకాదు.. ఆసంస్థ ఏర్పాటు చేసుకున్న సౌర వ్యవస్థలు సైతం దెబ్బతిన్నాయి. దీంతో ఇప్పుడు హెజ్ బొల్లా చక్రబంధంలో ఇరుక్కుపోయింది. ఈసమయంలో ఇజ్రాయెల్ పై యుద్ధం ప్రకటించినా.. శ్రేణులను సమన్వయం చేయడంలో ఇబ్బందులు తప్పవు.ఫలితంగా హెజ్ బొల్లా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఉంది. అంటే అంతగట్టిగా హెజ్ బొల్లాను .. ఇజ్రాయెల్ మూడో కన్నుదెబ్బతీసింది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :