ASBL Koncept Ambience
facebook whatsapp X

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌కు హైకోర్టులో ఊరట

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌కు హైకోర్టులో ఊరట

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. లగచర్ల దాడి కేసులో అరెస్టయిన ఆయన రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ చర్లపల్లి జైల్లో ఉన్న ఆయనను తోటి ఖైదీలతో ఉంచకుండా... ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇంటి భోజనం తెప్పించుకోవడానికి కూడా అనుమతించింది. ఇదే సమయంలో నరేందర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్ కోర్టు వాయిదా వేసింది. రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలనే పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, కాబట్టి బెయిల్ పిటిషన్ విచారణను వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :