ASBL Koncept Ambience
facebook whatsapp X

పట్నం నరేందర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

పట్నం నరేందర్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

లగచర్ల ఘటనలో ఇటీవల అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.. తనపై ఉన్న మరో కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గత నెల బొంరాస్‌పేటలో నరేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ కేసులో కూడా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని, కావున ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. బొంరాస్‌పేట కేసులో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం లేదని కోర్టుకు తెలియజేశారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :