Chennamaneni Ramesh: చెన్నమనేని రమేశ్ షాక్ ఇచ్చిన హైకోర్టు
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు తెలంగాణ హైకోర్టు(High Court) లో షాక్ తగిలింది. పౌరసత్వం కేసులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చెన్నమనేని రమేశ్ (Ramesh) జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. జర్మనీ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని, తప్పుడు డాక్యుమెంట్లతో గత 15 ఏళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆయనకు రూ.30 లక్షల జరిమానా విధించింది. నెలలోపు చెల్లించాలని స్పష్టం చేసింది. దీనిలో రూ.25 లక్షలు ప్రస్తుత ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Adi Srinivas)కు, రూ.5 లక్షలు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస్ గతంలో చెన్నమనేని రమేశ్‌కు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.