ASBL Koncept Ambience
facebook whatsapp X

శంక‌ర్ కు నెక్ట్స్ లెవెల్ ప్రెజ‌ర్

శంక‌ర్ కు నెక్ట్స్ లెవెల్ ప్రెజ‌ర్

సెప్టెంబ‌ర్ నెల స‌గానికి పైగా అయిపోయింది. ఇక‌పై గేమ్ ఛేంజ‌ర్ నుంచి నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయ‌ని నిర్మాత దిల్ రాజు చెప్పినా సౌండ్ మాత్రం లేదు. సెకండ్ సింగిల్ ఈ నెల‌లోనే ఉంటుంద‌ని వినాయ‌క చవితి పోస్ట‌ర్ లో చెప్పారు. కానీ దాని గురించి మ‌ళ్లీ ఎలాంటి అప్డేట్ లేదు. జ‌ర‌గండి సాంగ్ విష‌యంలో జ‌రిగిన పొర‌పాట్లు ఈసారి జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే శంక‌ర్ ఈ సినిమా విష‌యంలో చాలా ఒత్తిడిలో ఉన్నాడ‌ని తెలుస్తోంది. డిసెంబ‌ర్ రిలీజ్ టార్గెట్ ను ఎలాగైనా రీచ్ అవాల‌నే సంక‌ల్పంతో శంక‌ర్ ఏకంగా ఎడిట‌ర్ ను మార్చాల్సి వ‌చ్చింద‌ని టాక్ వినిపిస్తోంది. షామీర్ మొహ్మ‌ద్ ప్లేస్ లో ఆంటోనీ రూబెన్స్ వ‌చ్చిన‌ట్లు చెన్నై వ‌ర్గాలంటున్నాయి.

సీజీ వ‌ర్క్స్ ద‌గ్గ‌రుండి చూసుకుంటున్న శంక‌ర్ మ‌రే డెడ్ లైన్స్ పెట్టుకోకుండా సినిమా ప‌నిలోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ ఎంత ప్రెజ‌ర్ పెట్టినా తొంద‌రప‌డ‌కుండా నిదానంగా గేమ్ ఛేంజ‌ర్ ప‌నుల‌ను పూర్తి చేస్తున్నాడ‌ట‌. అందుకే రిలీజ్ డేట్ ను మేక‌ర్స్ అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌డం లేద‌ని స‌న్నిహిత వ‌ర్గాలంటున్నాయి. ఇండియ‌న్2 మీద వ‌చ్చిన విమ‌ర్శ‌ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే శంక‌ర్ గేమ్ ఛేంజ‌ర్ తో గ‌ట్టి కంబ్యాక్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :