అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి ముందు హైడ్రామా.. అసలు సంగతి అదే.
ఆంధ్రాలో రాజకీయాలు ఓ రేంజ్ లో ఉన్నాయి అనుకుంటే మన పురుగు రాష్ట్రం తెలంగాణలో మరింత రంజుగా మారుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. తాజాగా కేటీఆర్ సోదరి, కెసిఆర్ కుమార్తె అయిన కవిత బ్రెస్ట్ మరియు జైలు ఘటన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అదేవిధంగా కేటీఆర్ ని కూడా ఇంటి వద్ద అరెస్టు చేస్తారు అన్న వార్త వైరల్ కావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కేడర్ అలర్ట్ అయ్యింది. హైదరాబాద్ నంది నగర్ లోని కేటీఆర్ నివాసం వద్దకు అర్ధరాత్రి భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆ సమయంలో కార్యకర్తలు భారీఎత్తున నినాదాలు కూడా చేశారు. తనకోసం వచ్చిన వారిని గమనించిన కేటీఆర్ నివాసం నుంచి బయటకు వచ్చి వారిని పలకరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై జరిగిన దాడి కేసులు ఎన్నో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి.
ఇందులో భాగంగా ఈ ఘటన వెనుక బీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అయిన పట్నం నరేంద్ర రెడ్డి ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఆయన్ని ఏమని ముద్దాయిగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. విచారణలో భాగంగా నరేంద్ర రెడ్డి ఈ విషయంలో కేటీఆర్ పాత్ర ఉన్నట్లు వాంగ్మూలం ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్న పోలీసులు.. కేవలం ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం మాత్రమే కేటీఆర్ ఈ పనికి పాల్పడ్డారు అని పేర్కొన్నారు.
ఇక ఈ విషయంలో కేటీఆర్ ను ఏ క్షణంలో అయినా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీంతో అలర్ట్ అయినా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రంగంలోకి దిగారు. కేటీఆర్ ఇంటి వద్ద మొహరిస్తున్న జనాన్ని గమనించిన పోలీసులు అక్కడ భారీ ఎత్తుగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక దాడి విషయంలో సీరియస్ అయినా తెలంగాణ ప్రభుత్వం నేరస్తులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు అని అంటున్నారు. మరి కేటీఆర్ కూడా కవితలాగే జైలు పాలు అవుతారా లేక తప్పించుకుంటారా అన్న విషయంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి.