ASBL Koncept Ambience
facebook whatsapp X

స్పిరిట్ కోసం హాలీవుడ్ న‌టుడు

స్పిరిట్ కోసం హాలీవుడ్ న‌టుడు

క‌ల్కి సినిమాతో మంచి హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. రూ.300 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది. ఈ ఇయ‌ర్ ఎండింగ్ స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్సులున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పాన్ వ‌ర‌ల్డ్ మూవీగా తెర‌కెక్క‌నున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే ఈ సినిమాలో విల‌న్ రోల్ కోసం సౌత్ కొరియ‌న్ యాక్ట‌ర్ ని తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. ప్ర‌భాస్ కు ప్ర‌తినాయ‌కుడిగా లీ డాంగ్ సిక్ ను సంప్ర‌దిస్తున్నార‌ట‌. స్పిరిట్ కాన్సెప్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ లో లెవ‌ల్ లో ఉండ‌టం వ‌ల్ల హాలీవుడ్ యాక్ట‌ర్ ను ట్రై చేస్తున్న‌ట్లు టాక్.

లీ డాంగ్ సిక్ కు హాలీవుడ్ లో చాలా మంచి పేరుంది. స్పిరిట్ లో న‌టించ‌డానికి ఆయ‌న ఒప్పుకుంటే మాత్రం సినిమాకు నెక్ట్స్ లెవెల్ క్రేజ్ ఏర్ప‌డుతుంది. స్పిరిట్ లో ప్ర‌భాస్ రెండు డిఫ‌రెంట్ లుక్స్ లో క‌నిపిస్తాడ‌నే మాట వినిపిస్తోంది. మ‌రి ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్ లో క‌నిపిస్తాడా లేదా ఒకే వ్య‌క్తిని రెండు డిఫ‌రెంట్ లుక్స్ లో ప్రెజెంట్ చేస్తారా అన్న‌ది తెలియాల్సి ఉంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :