ASBL Koncept Ambience
facebook whatsapp X

కెనడాలో గృహ సంక్షోభ ఛాయలు..

కెనడాలో గృహ సంక్షోభ ఛాయలు..

యువత కలల ధామాల్లో ఒకటైన కెనడాలో పరిస్థితులు అగమ్యగోచరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా అక్కడ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. ఇక ఇళ్ల సంక్షోభం స్థానికులతో పాటు వలసదారులను బెంబేలెత్తిస్తోంది. ఇళ్ల అద్దెలతోపాటు లీజుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పోనీ ఒక ఇల్లు కొనేద్దాంలే! అనుకున్నా అవి కూడా అలానే ఉన్నాయి. దీంతో విద్యార్థులు, వలసదారులు కెనడా శివారు ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరికొందరు ఈ అద్దెల ధరలు భరించలేక దేశాన్నే విడిచిపెట్టేస్తున్నారు. ఎక్కువ మంది అల్‌బెర్టా ప్రావిన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరు అమెరికాకు వలస పోతున్నారు.

ఇళ్ల ధరలను భరించలేక కెనడాను వదిలేస్తున్న వారి సంఖ్య 28 శాతానికి చేరిందని ఆంగస్‌ రీడ్‌ ఇనిస్టిట్యూట్‌(ఏఆర్‌ఐ) తన నివేదికలో పేర్కొంది. ఫలితంగా కెనడా ప్రతిష్ఠ దెబ్బతింటోందని తెలిపింది.\ప్రధానంగా ఖరీదైన నగరాలుగా పేరున్న వాటిలో ఇళ్ల ధరలు, అద్దెలు కూడా నింగినంటాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నాటికి ఇళ్ల అద్దెల ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరింది. ఎన్నో ఆశలతో కెనడాకు వస్తున్న వలసదారులు ఇక్కడ నివసించేందుకు సౌకర్యవంతమైన పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గృహసంక్షోభం ఎఫెక్ట్..

ప్రస్తుతం ఉన్న ఇళ్ల అద్దెలు పెరగడంతో వాటిని ఖాళీ చేయాలని 28 శాతం మంది నిర్ణయించుకున్నారు. గత పదేళ్లుగా కెనడాలోనే ఉంటున్నవారిలో పలువురు ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.ఇక కెనడావాసుల్లో పదిమందిలో ముగ్గురు ఇళ్లధరలు పెరిగిపోవడంపై ఆందోళన చెందుతున్నారు. వలసదారులు పెరిగిపోవడంతో ఇళ్ల సంక్షోభం ఏర్పడిందని అధికశాతం మంతి కెనడియన్లు అభిప్రాయపడుతున్నారు.

29 నెలల గరిష్ఠానికి నిరుద్యోగం

కెనడాలో ఉద్యోగ కల్పన ఒడిదుడుకుల్లో పడింది. గత నెల జూన్‌లో 1400 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇదేసమయంలో నిరుద్యోగ సూచి 29 నెలల గరిష్ఠాన్ని నమోదు చేసింది. వాస్తవానికి మే నెలలోనే మార్కెట్‌ నిపుణులు నిరుద్యోగం 6.3 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. కానీ, వారి అంచనాలు దాటి మరీ నిరుద్యోగం నమోదైంది. యువతలో నిరుద్యోగ రేటు 0.9 నుంచి 13.5 శాతానికి చేరిందని విశ్లేషకులు తెలిపారు. ఉద్యోగుల వేతనాల పెంపు.. నియామకాలపై ప్రభావం చూపుతోందని అంటున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :